Childhood Pic: ఈ ఫోటోలో తాతా మనవడిని గుర్తుపట్టగలరా.. నందమూరి 3 తరాలు కలిసి నటించిన సినిమా.. ఏమిటంటే..
బాల్యం ఎవరికైనా అపురుపమే.. ఆ అందమైన బాల్యానికి గుర్తు చేసే కొన్ని ఫోటోలు చూడడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు అయితే ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో అలరిస్తాయి. మావోడు ఎలా ఉన్నాడో చిన్నప్పుడు చూడండి అంటూ తెగ షేర్ చేస్తూ సందడి చేస్తారు. అలా ఇప్పుడు ఒక సెలబ్రిటీకి సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులో టాలీవుడ్ లో ఫేమస్ ఫ్యామిలీకి సంబంధించిన తాతా మనవడు ఉన్నారు. మరి మీరు ఆ తాత మనవడు ఎవరో ? ఏ సినిమాలో ఇద్దరు కలిసి నటించారో చెప్పగలరేమో ట్రై చేయండి..

స్టార్ హీరోలకు జోడీగా నటించే హీరోయిన్ కు ఉండే క్రేజ్ వేరు.. ఇక కొంతమంది హీరోలకు జోడీగా ఒక్క సినిమాలో నటించినా చాలు అనే స్టార్ హీరోయిన్ల గురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం. ఇక తమ అభిమాన హీరో పక్కన నటించే హీరోయిన్ కు సంబంధించిన విషయాలపై ఆసక్తిని కనబరుస్తూనే ఉంటారు
సినీ నటీనటులు, క్రీడాకారులు, రాజకీయ నేతలు ఇలా తమ ఫేవరేట్ పర్సన్స్ చిన్నప్పుడు ఎలా ఉన్నారో అని అభిమానులు ఆలోచిస్తూ ఉంటారు. వారి చిన్న తనంలోని ఫోటోలు చూడాలని.. వారికి ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు. అయితే కొంతమంది సినీ సెలబ్రెటీలు చిన్న తనంలో వెండి తెరపై అడుగు పెట్టి.. కాలక్రమంలో హీరోగా మారి స్టార్ హీరోగా రికార్డ్స్ సృష్టిస్తున్నవారు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో టాలీవుడ్ లో ఫేమస్ ఫ్యామిలీకి సంబంధించిన తాతా మనవడు ఉన్నారు. ఆ తాత మనవడు ఎవరు? ఇద్దరూ కలిసి ఏ సినిమాలో నటించారో చెప్పగలరేమో ప్రయత్నించండి. అవును ఆ ఫోటోలో ఉంది నందమూరి ఫ్యామిలీ హీరోలు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో నటనలో చెరగని సంతకం చేసిన నందమూరి తారక రామారావుతో.. మనుమడు ఎన్టిఆర్ కలిసి ఉన్నాడు. ఎన్టీఆర్ నటుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగువారు ముద్దుగా అన్నాగారు అనిపిలుచుకునే ఎన్టిఆర్ ఎన్నో సంచలనాలను సృష్టించాడు. అందులో ఒకటి ఓ వైపు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి.. మరోవైపు సినిమాల్లో నటించాడు. ఆ సినిమానే బ్రహ్మర్షి విశ్వామిత్ర.
ఈ సినిమా నందమూరి తారక రామారావు దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ అయిన ఎన్.ఏ.టి. పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. పురాణాల్లోని విశ్వామిత్రుని కథను ఆధారంగా చేసుకుని తెరక్కెకిన ఈ సినిమాలో సి.ఎం. హోదాలోనే మళ్ళీ తెరపై నటించి చరిత్ర సృష్టించారు. ఈ సినిమాలో విశ్వామిత్ర, రావణ రెండు పాత్రల్లో ఎన్టిఆర్ నటించగా.. ఎన్టీఆర్ కుమారుడైన హీరో బాలకృష్ణ సత్య హరిశ్చంద్రుడు, దుష్యంతుడుగా నటించాడు.
ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ లో హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు చిన్నారి భరతుడి వేషం వేయించారు. ఎన్టీఆర్. అలా పెద్ద ఎన్టీఆర్ చేతుల మీదుగా చిన్న ఎన్టీఆర్ సినీ రంగప్రవేశం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణ దుష్యంతుడిగా నటించడం విశేషం. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కాలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








