- Telugu News Photo Gallery Spiritual photos Astrology predictions: after lunar eclipse these six zodiac signs get good luck
చంద్రగ్రహణం తర్వాత 6 నెలలు అష్టైశ్వర్యాలు ఈ రాశుల సొంతం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
సనాతన ధర్మంలో గ్రహణానికి సంబంధించి అనేక పురాణ కథలున్నాయి. సూర్య, చంద్ర గ్రహాలను రాహువు, కేతువులు మింగడం వలన గ్రహణాలు ఏర్పడతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ గ్రహణ సమయం కష్టకాలంగా పరిగణిస్తారు. హిందువులు గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను జపించడం, దానధర్మాలు చేయడం వంటివి చేస్తారు. ఈ సంప్రదాయం అధ్యత్మికంగానే కాదు శాస్త్రీయంగా కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించనుంది. ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకోస్తుందట. ఆ రాశులు ఏమిటంటే..
Updated on: Sep 04, 2025 | 8:56 AM

సెప్టెంబర్ 7వ తేదీ 2025 ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. మన దేశంలో కనిపించనుంది. కనుక సూతక కాలం ఉంటుంది. అంతేకాదు కుంభ రాశిలో ఏర్పడనున్న ఈ చంద్ర గ్రహణం.. రాహు గ్రస్త చంద్రగ్రహణం అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితాల్లో ఊహించని విధంగా అదృష్టాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా ఆరు రాశులకు చెందిన వ్యక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధనయోగం ఏర్పడే అవకాశం ఉందట. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు చంద్రగ్రహణం తర్వాత ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు జీతం పెరుగుల ఉంటుంది. వీరు తమ పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తానికి ఈ రాశికి వారికీ చంద్ర గ్రహణం తర్వాత పట్టిందల్లా బంగారమే అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు

వృషభ రాశి: వీరికి చంద్రగ్రహణం తర్వాత శుక్ర బలం పెరుగుతుంది. దీంతో సంపాదన పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. కొన్ని గ్రహాల అనుకూలంగా మారతాయి. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారుస్థులు లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగి.. సంతోషంగా ఉంటారు.

తులా రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల 7 నుంచి పట్టిందల్లా బంగారమే అవుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారుస్తులు పెట్టుబడిపై లాభాలను ఆర్జిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఈ సమయం శుభ తరుణం. భాగస్వామి వ్యాపారం చేయాలనుకుంటే అనువైన సమయం. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనుస్సు రాశి: వీరు తల్లిదండ్రుల సహకారంతో వృద్ధి సాధిస్తారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. సోదరుల మధ్య బంధం పెరుగుతుంది. ఆర్థిక సంబంధించిన వివాదాలు తొలగి అన్ని విధాలా లాభాలను పొందుతారు. గురు బలం ఎక్కువగా ఉండడంతో ఈ రాశికి చెందిన యువతీ యువకులకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే వివాహం కుదిరే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలు రాసే స్టూడెంట్స్ సక్సెస్ అందుకుంటారు.

మకర రాశి: వీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల ద్వారా లాభపడతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం పొందుతారు. అదే సమయంలో ఖర్చులు విపరీతంగా చేస్తారు. వస్తువుల కొనే విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి.

మీన రాశి: వీరు తల్లిదండ్రుల సహకారంతో వృద్ధి సాధిస్తారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. సోదరుల మధ్య బంధం పెరుగుతుంది. ఆర్థిక సంబంధించిన వివాదాలు తొలగి అన్ని విధాలా లాభాలను పొందుతారు. గురు బలం ఎక్కువగా ఉండడంతో ఈ రాశికి చెందిన యువతీ యువకులకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే వివాహం కుదిరే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలు రాసే స్టూడెంట్స్ సక్సెస్ అందుకుంటారు.




