అంబానీకి ఏమాత్రం తీసిపోడు.. 4 వేల జీతంతో రూ. కోటి పొదుపు.. ఆర్థిక క్రమశిక్షణ నేటి తరానికి స్పూర్తి
డబ్బులేని వాడు డుబ్బుకు కొరగాడు అనే సామెత ప్రస్తుతం సమాజానికి సరిగ్గా సరిపోతుంది. డబ్బులను, ఆస్తులు అంతస్తులను బట్టి సమాజంలో గౌరవం లభిస్తుంది. అందుకనే చాలా మంది తమ స్టేటస్ ని మార్చుకునేందుకు శక్తి మించి మరీ కష్టపడతారు. అయితే ఎంత కష్టపడి సంపాదించినా.. ఆ డబ్బుని సరైన పద్దతిలో ఉపయోగించాలి. డబ్బుని ఆదా చేయాలి. దీనిని ఆర్థిక మేనేజ్మెంట్ అని అంటారు. ఇలా 10వ తరగతి వరకు చదువుకున్న ఓ వ్యక్తి తనకు వచ్చిన జీతంలోని కొంత మొత్తం పొదుపు చేస్తూ.. 25 సంవత్సరాలలో 1 కోటి రూపాయలు ఆదా చేశాడు. ప్రస్తుతం ఆ వ్యక్తికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

డబ్బు సంపాదించడానికి, పొదుపు చేయడానికి ( ఆర్థిక క్రమశిక్షణ ) కష్టపడి పనిచేయడం, సంకల్పం మాత్రమే ముఖ్యం. దీనికి విద్య అవసరం లేదు.. సంపాదించడానికి తెలివితేటలు, కష్టపడి పనిచేయడం అవసరం. తన 53 సంవత్సరాలలో ఆర్థిక క్రమశిక్షణతో జీవితంలో ఎంత గొప్పగా ఎదగవచ్చో తెలియజేసే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కథ ఇక్కడ ఉంది. ఇది Redditలో షేర్ చేయబడింది. ఇప్పుడు ఈ కథ చాలా మంది యువతకు ప్రేరణగా మారింది. 10వ తరగతిలో చదువును ఆపివేసి.. 4,200 జీతంతో తన కెరీర్‌ను ప్రారంభించి, అప్పులు, క్రెడిట్ కార్డులు లేదా విలాసవంతమైన జీవనశైలి లేకుండా 25 సంవత్సరాలలో కోటి రూపాయలు ఆదా చేసిన వ్యక్తి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వ్యక్తీ తన జీవితంలో భారీ మొత్తాన్ని సంపాదించాడు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో ఆయన కోటి రూపాయలు సంపాదించడానికి 25 సంవత్సరాలు పట్టిందని రాశారు. 2000 సంవత్సరంలో బెంగళూరులో కేవలం రూ. 5,000 తో అడుగు పెట్టాడు. ఆయన మొదటి అందుకున్న జీతంరూ. 4,200. అలా మొదలైన జర్నీ 25 సంవత్సరాల నిరంతర కృషి, పొదుపు ద్వారా.. ఆయన బ్యాంకు డిపాజిట్లలో ఇప్పుడు రూ .1.01 కోట్లు ఉంది. అంతేకాదు ఈక్విటీలో ₹ 65,000 పెట్టుబడి పెట్టాడు. అతని జీవితంలో ఎప్పుడు అప్పు తీసుకోలేదు. కనీసం ఖర్చుల కోసం క్రెడిట్ కార్డు కూడా ఉపయోగించకుండానే ఆయన చాలా డబ్బు ఆదా చేశారు.
తాను దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చానని.. కేవలం 10వ తరగది చదువుకున్న నేను సొంతంగా ఇంగ్లీష్ మాట్లాడం నేర్చుకున్నానని చెప్పాడు. 2000 సంవత్సరంలో బెంగళూరుకు వచ్చాను. అప్పుడు నాకు 27 సంవత్సరాలు.. నా జేబులో 5 వేలు ఉన్నాయి. నేను నా తల్లిదండ్రులను డబ్బు లేదా సహాయం అడగలేదు. మేము చాలా పేదవాళ్ళం. నా మొదటి జీతం దాదాపు 4,200 రూపాయలు. నేను చివరిగా అందుకున్న జీతం దాదాపు 63 వేల రూపాయలు అని ఆ వ్యక్తి తన జీవితం గురించి చెప్పాడు. ఇన్ని సంవత్సరాలలో నేను కారు కొనలేదు. డబ్బు కోసం లేదా ఇది కష్టం అని ఎప్పుడు చేయి చాచి డబ్బులు అడగలేదు. తన సంపాదనలో కొంత మొత్తం పొడుపు చేయాలనే లక్షంగా పెట్టుకుని వచ్చిన జీవితంలోనే జీవితాన్ని గడిపినట్లు వెల్లడించాడు.
Reached a (major) milestone — 1 Crore, took me 25 years byu/srikavig inpersonalfinanceindia
మా పూర్వీకుల ఇల్లు గ్రామంలో ఉంది. మేము అక్కడే ఉండేవారం. మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. దీంతో మా తల్లిదండ్రులు చాలా పొదుపుగా ఉండేవారు. నాకు కూడా అదే అలవాటు వచ్చింది. అంతేకాదు అదృష్టవశాత్తూ.. మాకు ఎప్పుడూ పెద్ద అనారోగ్యాలు లేదా కష్టాలు రాలేదు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా కేరింగ్ గా ఉంటాం అని అతను చెప్పిన విషయాలు ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చక్కరు కొడుతోంది. ఈ పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించేటప్పుడు .. ప్రస్తుత తరానికి రేపటి గురించి భయం, జీవిత విధానం పట్ల స్పష్టత లేకుండా గడిపేస్తున్నారు. ఇటువంటి సమయంలో మీ పోస్ట్ చాలా బరువైనది.. అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు మీ పనిని నేను నిజంగా అభినందిస్తున్నాను!! మీ అనుభవాన్ని నేటి తరానికి పంచుకున్నందుకు ధన్యవాదాలు. ప్రస్తుత కోటి రూపాయల నుంచి మరొక కోటి రూపాయలు సంపాదన ఎలా అని అలోచించండి. ఖర్చు చేయడం కంటే పొదుపు చేయడం సులభం అని నేటి గుర్తు చేసుకుంటే జీవితంలో ఆర్ధిక కష్టాలు ఎప్పుడూ రావు అని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
