Actress: 8 ఏళ్ల క్రితం సోషల్ మీడియాను ఊపేసిన సాంగ్.. ఈ అమ్మడు గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..
స్టార్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు.. ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమస్ అయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమాతో నెట్టింట విపరతీమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారలు.. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయారు. కానీ ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.

ఎనిమిదేళ్ల క్రితం ఓ తమిళ్ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపేసింది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలోని అడియన్స్ తెగ అట్రాక్ట్ అయిపోయారు. అదే తమిళ చిత్రం “మీసాయ మురుక్కు”లోని ‘ఎన్న నదంతాలు.. పెన్నే ఉన్నా విడా మాతేన్’ అంటూ సాగే సాంగ్. ఇక ఆ పాటలో కనిపించిన అమ్మాడి అందానికి.. అమాయకత్వానికి జనాలు ముగ్దులైపోయారు. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టే ఉంటారు కదా.. ఇప్పటికీ కుర్రాళ్ల ఆరాధ్య దేవత. అప్పట్లో ఫస్ట్ మూవీతోనే కుర్రకారుకు కునుకు లేకుండా చేసిన ముద్దుగుమ్మ. తొలి చిత్రంతోనే ఓ రేంజ్ క్రేజ్ చేసుకుంది. ఈ హీరోయిన్ పేరు ఆత్మిక. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే ఈ వయ్యారి. తమిళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ఆత్మిక.. తమిళ చిత్రపరిశ్రమలో తోపు హీరోయిన్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఆత్మిక.. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తితో పలు షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అప్పుడే కొన్ని మోడలింగ్ యాడ్స్ సైతం చేసింది. అయితే ఆన్ లైన్ లో ఆమె ప్రోఫైల్ చూసిన తమిళ్ హిప్ హాప్ స్టార్ తమిజాకు చెందిన సింగర్ కమ్ హీరో ఆది ఆమెకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఆది హీరోగా తెరకెక్కించిన మీసాయ మురుక్కు సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ త్రవాత 2017లో కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన కోడియిల్ ఒరవన్ చిత్రంతో మరోసారి జనాలను అలరించింది.
ఇవి కూడా చదవండి: Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..
తమిళంలో కట్టేరి, కన్నై నంబాతే, తిరువిన్ కురల్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో 2022లో విజయ్ రాఘవన్ సినిమాలో నటించింది. అయితే అందం, అభినయంతో క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..
View this post on Instagram
సాంగ్ వీడియో..
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..








