AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richa Pallod: తరుణ్ ‘చిరుజల్లు’ హీరోయిన్ గుర్తుందా.. ? నెట్టింట కాకరేపుతోన్న సీనియర్ బ్యూటీ..

టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు తరుణ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉండేది. ఎన్నో అందమైన ప్రేమకథలతోో సూపర్ హిట్స్ అందుకున్నారు. అందులో చిరుజల్లు ఒకటి. నువ్వే కావాలి హిట్ తర్వాత మరోసారి తరుణ్, రిచా పల్లాడ్ జోడి కలిసి నటించిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.

Richa Pallod: తరుణ్ 'చిరుజల్లు' హీరోయిన్ గుర్తుందా.. ? నెట్టింట కాకరేపుతోన్న సీనియర్ బ్యూటీ..
Richa Pallod
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2024 | 11:03 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ తరుణ్. ఎన్నో సూపర్ హిట్ ప్రేమకథలతో ప్రేక్షకులను అలరించాడు. అప్పట్లో తరుణ్ లవ్ స్టోరీ మూవీస్ కు యూత్ లో ఎక్కువగా క్రేజ్ ఉండేది. ఇప్పటికీ తరుణ్ చిత్రాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. తరుణ్ నటించిన సూపర్ హిట్ ప్రేమకథలలో చిరుజల్లు ఒకటి. 2001లో ఆగస్ట్ 17న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. ఇందులో తరుణ్ సరసన రిచా పల్లాడ్ కథానాయికగా మెరిసింది. ఈ మూవీలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఈ మూవీలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

ఈ సినిమాలో తరుణ్ సరసన నటించిన రిచా పల్లాడ్ గుర్తుందా…? అప్పట్లో ఈ బ్యూటీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు ఒకప్పుడు హిట్ పెయిర్. ఈ సినిమా కంటే ముందు ఇద్దరు కలిసి నటించిన నువ్వే కావాలి మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మ్యూజికల్ హిట్ అయ్యింది. రిచా పల్లాడ్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. హోలీ, నా మనసిస్తారా, పెళ్లాం పిచ్చోడు వంటి చిత్రాల్లో మెరిసింది. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషలలోనూ నటించింది.

ఇవి కూడా చదవండి

2016 తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమయ్యింది రిచా పల్లాడ్. 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి 2013లో ఒక కుమారుడు జన్మించాడు. 2018లో ఖాన్ నెంబర్ 1 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. 2020లో లాల్ ఇష్య్కూ అనే వెబ్ సిరీస్.. యువర్ హానర్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై సీరియల్స్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.

View this post on Instagram

A post shared by Richa Pallod (@richapallod)

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.