యంగ్ బ్యూటీ  శ్రీలీల స్పీడ్‌కు బ్రేకులు పడ్డట్టేనా..! 

23 December 2025

Pic credit - Instagram

Rajeev 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామల్లో యంగ్ బ్యూటీ శ్రీలీల ఒకరు. ఈ అందాల భామ తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ టాలివుడ్ రాణిస్తుంది ఈ ముద్దుగుమ్మ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ చిన్నదానికి సరైన హిట్ పడలేదు.

పెళ్లి సందడి సినిమా తర్వాత రవితేజ నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది ఈ చిన్నది. ఆ సినిమా తర్వాత ఒక్క హిట్ లేదు.

మధ్యలో బాలకృష్ణతో కలిసి నటించిన భగవంత్ కేసరి సినిమా హిట్ అయినప్పటికీ అదిబాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. 

అక్కడి నుంచి మళ్లీ షరామామూలే.. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు ఈ భామ నటించిన సినిమాలన్నీ ఫట్. 

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తుండోయ్ శ్రీలీల. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తుంది. 

అయితే ఈ సినిమా తర్వాత శ్రీలీల మరో సినిమా అనౌన్స్ చేయలేదు. దాంతో ఈ అమ్మడి స్పీడ్ కు బ్రేకులు పడ్డాయా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.