AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారానికి ఇవి 2 పచ్చిగానే నమిలి తింటే.. జీవితంలో క్యాన్సర్ రాదట!

క్యారెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. వారానికి కనీసం రెండుసార్లు క్యారెట్లు తినడం వల్ల తీవ్రమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యారెట్లను సలాడ్ల నుంచి జ్యూస్‌ల వరకు అనేక విధాలుగా తినవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో క్యారెట్లు తాజా కూరగాయలు..

వారానికి ఇవి 2 పచ్చిగానే నమిలి తింటే.. జీవితంలో క్యాన్సర్ రాదట!
Eating Carrots Daily Can Reduce Cancer Risk
Srilakshmi C
|

Updated on: Dec 24, 2025 | 9:54 PM

Share

క్యారెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. వారానికి కనీసం రెండుసార్లు క్యారెట్లు తినడం వల్ల తీవ్రమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యారెట్లను సలాడ్ల నుంచి జ్యూస్‌ల వరకు అనేక విధాలుగా తినవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో క్యారెట్లు తాజా కూరగాయలు, పండ్లతో పాటు తక్కువ ధరకే లభిస్తాయి. కాబట్టి ఈ కాలంలో తాజా క్యారెట్లను తినడం చాలా సులువు. ఇవి తినడానికి రుచికరంగా కూడా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

కొలొరెక్టల్ క్యాన్సర్‌ను నివారించడంలో క్యారెట్లు భేష్‌

కొంతమంది తాజా క్యారెట్లను పచ్చిగా తింటారు. మరికొందరు వాటిని వివిధ వంటలలో తయారు చేసి తింటారు. ప్రత్యేకత ఏమిటంటే మీరు ఈ క్యారెట్లను ఎలా తిన్నా, అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇటీవలి అధ్యయనం ప్రకారం.. వారానికి 2 నుండి 4 పచ్చి క్యారెట్లు తినడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని దాదాపు 17 శాతం తగ్గించవచ్చట. కొలొరెక్టల్ క్యాన్సర్ అనేది పెద్దప్రేగు లేదా పురీషనాళంలో ప్రారంభమయ్యే క్యాన్సర్. ఇది సాధారణంగా పాలిప్స్ అని పిలువబడే పెరుగుదలల వల్ల సంభవిస్తుంది.

క్యారెట్లలో కెరోటినాయిడ్లు, లుటిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. వీటిని వారానికి కనీసం రెండుసార్లు తీసుకోవడం పాలిప్స్‌ పేగుల్లో ఏర్పడకుండా నిరోధిస్తుంది. క్యారెట్లు శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వాటి శోథ నిరోధక లక్షణాల కారణంగా అవి రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. విటమిన్ కె, విటమిన్ బి6 వంటి ఇతర పోషకాలకు మంచి మూలం. వీటిలోని బీటా-కెరోటిన్ రేచీకటి, కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అయితే క్యారెట్లతో తయారు చేసిన స్వీట్లు లేదా ఇతర ఆహారాలను తినడం కంటే పచ్చి క్యారెట్లు తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా వీటిని ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

చలికాలంలో జామకాయ తింటే ఏమవుతుంది.. తినేముందు తప్పక తెలుసుకోండి..
చలికాలంలో జామకాయ తింటే ఏమవుతుంది.. తినేముందు తప్పక తెలుసుకోండి..
ఈ సింపుల్‌ ట్రిక్ తెలిస్తే.. వడ్డీలేకుండానే గోల్డ్‌ లోన్ పొందవచ్చ
ఈ సింపుల్‌ ట్రిక్ తెలిస్తే.. వడ్డీలేకుండానే గోల్డ్‌ లోన్ పొందవచ్చ
నిద్రలేమితో బాధపడేవారికి తిరుగులేని మంత్రం.. రోజూ 15ని ఇలా చేయండి
నిద్రలేమితో బాధపడేవారికి తిరుగులేని మంత్రం.. రోజూ 15ని ఇలా చేయండి
లయ ఇంట సంక్రాంతి బొమ్మల కొలువు.. బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?
లయ ఇంట సంక్రాంతి బొమ్మల కొలువు.. బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?
ఆ సినిమా కోసమే నన్ను దేవుడు సినిమా పరిశ్రమకు పంపాడేమో..!
ఆ సినిమా కోసమే నన్ను దేవుడు సినిమా పరిశ్రమకు పంపాడేమో..!
ఈ స్టార్ హీరో ఒకప్పుడు ఇంటింటికీ వెళ్లి షాంపూలు అమ్మాడు..
ఈ స్టార్ హీరో ఒకప్పుడు ఇంటింటికీ వెళ్లి షాంపూలు అమ్మాడు..
రాత్రికి రాత్రే నలుగురు పిల్లలు, తల్లి అదృశ్యం..!
రాత్రికి రాత్రే నలుగురు పిల్లలు, తల్లి అదృశ్యం..!
మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ. 9250 ఆదాయం..
ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ. 9250 ఆదాయం..
భయం అంటే తెలీదు.. కావ్య పాప కొత్త డేంజరస్ వెపన్ రెడీ
భయం అంటే తెలీదు.. కావ్య పాప కొత్త డేంజరస్ వెపన్ రెడీ