Hyderabad: ఒరెయ్ ప్రభాకర్.. ఇన్ని రాష్ట్రాల పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతున్నావ్..
ఏపీ, తెలంగాణ పోలీసులకు చాలెంజ్‌గా మారిన మోస్ట్ వాంటెడ్ నిందితుడు బత్తుల ప్రభాకర్.. ఇప్పుడు తమిళనాడు పోలీసులకు కూడా సవాల్ విసిరాడు. ఫలితంగా.. చోరీల చాలెంజ్‌లతో మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. రెండు నెలల క్రితం విజయవాడ పోలీసుల కళ్లు గప్పి పరారైన బత్తుల ప్రభాకర్.. తమిళనాడులో మరో చోరీతో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. మరి.. బత్తుల ప్రభాకర్ ఎపిసోడ్‌లో వాట్ నెక్ట్స్...?

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారాడు. ఈ సారి కూడా ఓ కాలేజ్‌లో చోరీ చేసి.. తమిళనాడు పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో.. మూడు రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగారు. ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్‌లో జరిగిన డబ్బుల చోరీ కేసులో బత్తుల ప్రభాకర్ పాత్ర ఉన్నట్లు తమిళనాడు పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం కళాశాలలో చోరీకి సంబంధించిన దృశ్యాల్లో బత్తుల ప్రభాకర్ ఐడెంటీఫై అయ్యాడు. దాదాపు 80 వరకు చోరీల్లో పాత్ర ఉన్నట్లు భావిస్తున్న.. హైదరాబాద్‌లో ప్రిజం పబ్ వద్ద పట్టుకోడానికి వెళ్తే.. ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరిపాడు. స్థానికులు సాయంతో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న బత్తుల ప్రభాకర్‌ను ఆ రోజు హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత విజయవాడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌లోనూ చోరీ చేసి పరారైన ఘటనలో నిందితుడిగా ఉండడంతో ఏపీ పోలీసులు పీటీ వారెంట్‌పై విజయవాడకు తరలించారు. గత సెప్టెంబర్‌లో విజయవాడ కోర్టు నందు హాజరు పరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా ఎస్కార్ట్ సిబ్బందిని మాయ చేసి బత్తుల ప్రభాకర్ పరావడం కలకలం సృష్టించింది. అప్పటినుంచి రెండు నెలలుగా విజయవాడ సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు సడెన్‌గా చెన్నైలోని ఓ కాలేజ్‌లో 45 లక్షల చోరీ కేసు దర్యాప్తుతో నిందితుడు పాత నేరస్థుడైన బత్తుల ప్రభాకర్‌ను తమిళనాడు పోలీసులు గుర్తించి తెలుగు రాష్ట్రాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. విజయవాడ సీసీఎస్ పోలీసులు చెన్నైకి వెళ్లారు. మొత్తంగా.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ పోలీసులకు బత్తుల ప్రభాకర్ వ్యవహారం సవాలుగా మారింది. సౌత్‌లో మొత్తం 80 కేసుల్లో బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ నిందితుడు కావడంతో ఈ సారి స్పెషల్ ఫోకస్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇతగాడు వారంలో తొలి 3 రోజులు ప్లానింగ్ చేసి.. గురువారం మాత్రమే చోరీలకు పాల్పడతాడని పోలీసులకు సమాచారం ఉంది. ప్రముఖ కాలేజీలు, విద్యా సంస్థల్లో అతని ప్రధాన టార్గెట్. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ లైఫ్ స్టైల్ కూడా చాలా లగ్జీరీగా ఉంటుంది. బ్రాడెండ్ దుస్తులు వేసుకుంటాడు. ప్రియయం మందు తాగుతాడు. ఫిట్ నెస్ కోసం నిత్యం కసరత్తులు చేస్తాడు. ఖరీదైన కార్లలో తిరుగుతూ.. పబ్బుల్లో, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు.
