AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిందే.. సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు

విడుదలైన ప్రభుత్వ జీవోలు.. వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టలేదంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. జీవోల విషయంలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ ఆరోపిస్తే.. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చాలా జీవోలను దాచిపెట్టిందని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు.

Telangana: ప్రభుత్వం జీవోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిందే.. సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు
Telangana High Court
Ravi Kiran
|

Updated on: Dec 25, 2025 | 7:56 AM

Share

ప్రభుత్వ జీవోలు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టకపోవడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. రెండేళ్లలో ప్రభుత్వం 9 వేల 64 జీవోలు జారీ చేస్తే అందులో 3 వేల 290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయని పిటిషనర్ వాదించారు. మిగతా జీవోలను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. తక్షణమే జీవోలన్నీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోలను దాచి పెడుతోందన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు. ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటోన్న రేవంత్‌రెడ్డి.. చీకటి జీవోలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.

13 నెలల్లో 15వేల 77 జీవోలు దాచిపెట్టారంటూ ఎక్స్‌ వేదికగా ఫైర్ అయ్యారు హరీష్ రావు. హైకోర్టు తీర్పు ప్రకారం అన్నిజీవోలను వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి లెక్క ప్రజల ముందు ఉంచాల్సిందే అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జీవోలు దాస్తున్నారంటే.. ఏదో తప్పు చేస్తున్నారనే అర్థం అన్నారు.ప్రభుత్వ జీవోలపై హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు TPCC చీఫ్‌ మహేష్‌కుమార్ గౌడ్. పదేళ్ల పాలనలో BRS ఎన్ని జీవోలు దాచిపెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. BRS పాలనలోనే ఒక్క జీవో కూడా బయటకు రాలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకంగా GOలు బయటపెడుతుందన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు కాంగ్రెస్ నేతలు

Follow Us
ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు
ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు
అన్నా ఏంటిలా మారిపోయావ్‌? ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?
అన్నా ఏంటిలా మారిపోయావ్‌? ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?
24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి
24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి
చల్లటి వెదర్ లో స్పైసీ బేబీ కార్న్ 65.. ఇలా చేస్తే యమ్మీ టేస్ట్
చల్లటి వెదర్ లో స్పైసీ బేబీ కార్న్ 65.. ఇలా చేస్తే యమ్మీ టేస్ట్
గుండెపోటుకు 10 రోజుల ముందే శరీరం ఇచ్చే 5 డేంజర్ సిగ్నల్స్!
గుండెపోటుకు 10 రోజుల ముందే శరీరం ఇచ్చే 5 డేంజర్ సిగ్నల్స్!
వాట్సాప్‌లో పెద్ద మార్పు.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
వాట్సాప్‌లో పెద్ద మార్పు.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే
కలల వెనుక మెదడు మాయాజాలం.. మర్చిపోవడానికి కారణం ఇదే!
కలల వెనుక మెదడు మాయాజాలం.. మర్చిపోవడానికి కారణం ఇదే!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కుంభ రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కుంభ రాశి వారికి ఇలా..
ఫైనాన్స్ లక్కీ రాశులు: ఈ గర్ల్స్ దగ్గర ఉండటం అంటే మనీ, లవ్ బోనస్
ఫైనాన్స్ లక్కీ రాశులు: ఈ గర్ల్స్ దగ్గర ఉండటం అంటే మనీ, లవ్ బోనస్