అందాల తార మధుబాల ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను
మధుబాల.. ఒకప్పుడు సౌత్ కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యింది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. 90వ దశకంలో దక్షిణాదిలోని అగ్ర హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో మెస్మరైజ్ చేసిన ఆమె.. ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది.

ఒకప్పటి అందాల భామల్లో ముందు వరసలో ఉండే హీరోయిన్ మధుబాల. చూడచక్కని రూపంతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు మధుబాల. ఐశ్వర్య రాయితో అందంలో పోటీపడ్డ బ్యూటీ ఎవరైనా ఉన్నారంటే అది మధుబాల అనే చెప్పాలి. ఇప్పటికి అదే అందంతో ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన మధుబాల. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. హీరో, హీరోయిన్స్ కు అమ్మగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో మధుబాలకు భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె ప్రేమ దేశం అనే సినిమాలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ ..! పెట్టింది రూ.5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు
ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు మధుబాల. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ గురించి మాట్లాడారు మధుబాల. హీరోయిన్స్ విషయంలో తనకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టమని అన్నారు. ఆమె డాన్స్ నటన చాలా నచ్చుతుందని మెచ్చుకున్నారు. అలాగే హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తాను వీరాభిమానిని అని అన్నారు మధుబాల.
ఇది కూడా చదవండి : స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. అతని వల్ల తొమ్మిదేళ్లు ఆ పని చేయలేదన్న హీరోయిన్
అలాగే ఈతరం హీరోలలో తనకు నాగచైతన్య అంటే నాకు ఎంతో ఇష్టమని మధుబాల చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధు బాల చేసిన కామెంట్స్ తో అటు పవన్ అభిమానులు, ఇటు అక్కినేని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. పవన్ అభిమానులు ఇటు చైతన్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమె కామెంట్స్ ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం మధుబాల సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది మధుబాల.
ఇది కూడా చదవండి : చేతిలో రూ. 5వేలు.. కడుపు నింపుకోవడానికి ఒక్క బ్రేడ్ మాత్రమే.. కట్ చేస్తే ఒక్క సాంగ్‌కు రూ. రెండు కోట్లకు పైగా అందుకుంటుంది
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








