Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas – Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డార్లింగ్ రాజాసాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరోవైపు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు..

Prabhas - Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
Prabhas, Sandeep Reddy Vanga
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 30, 2025 | 5:05 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డార్లింగ్ రాజాసాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరోవైపు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు..పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో డార్లింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. తర్వలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు ప్రభాస్ చేతిలో మరో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో స్పిరిట్ ఒకటి. యానిమల్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా ? అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ఈ క్రమంలో తాజాగా డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యూఎస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. స్పిరిట్ షూటింగ్ అప్డేట్ పంచుకున్నారు. చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని.. అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సంగీత చర్చలు సైతం స్టార్ట్ అయ్యాయని.. హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారని అన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. డార్లింగ్ కెరీర్ లో తొలిసారి పోలీస్ అధికారిగా నటించనున్నారు. సందీప్ రెడ్డి ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తొలి రోజే రూ.150 కోట్లు వసూళ్లు చేస్తుందని.. ప్రభాస్ తన గత 24 చిత్రాలు ఒకెత్తు అయితే.. ఇప్పుడు స్పిరిట్ మరో ఎత్తు అన్నారు. దీంతో స్పిరిట్ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కనిపించే నటీనటుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమాతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సినిమాలోనూ నటిస్తున్నారు. అలాగే మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రంలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు.

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..