AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuvve Kavali: ‘నువ్వే కావాలి’ రిలీజై 25 ఏళ్లు.. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

నువ్వే కావాలి.. తెలుగులో తెరకెక్కిన సూపర్ హిట్ ప్రేమకథా చిత్రాల్లో ఇది ఒకటి. 2000లో విడుదలైన ఈ లవ్ స్టోరీ యూత్ ను తెగ ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. అలాగే ఎన్నో అవార్డులను కూడా తెచ్చిపెట్టింది.

Nuvve Kavali: 'నువ్వే కావాలి' రిలీజై 25 ఏళ్లు.. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Nuvve Kaval Movie
Basha Shek
|

Updated on: Oct 13, 2025 | 6:47 PM

Share

లవర్ బాయ్ తరుణ్, రిచా జంటగా నటించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ‘నువ్వే కావాలి’. కె.విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా ఆడియెన్స్ ను అలరించే అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నాయి. అందుకే ఆడియెన్స్ ఈ మూవీ కోసం థియేటర్లకు పరుగులు తీశారు. ముఖ్యంగా యూత్ అయితే నువ్వే కావాలి సినిమా టికెటట్ల కోసం ఎగబడ్డారు. అప్పట్లో కేవలం రూ.1.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ రూ.24 కోట్ల కు పైగా వసూలు చేసింది. 20 సెంటర్స్‌కు పైగా 200 రోజులు రన్ కాగా… 6 సెంటర్లలో ఏడాది పాటు ప్రదర్శితమైంది. ఇక హైదరాబాద్ లోని ఓ థియేటర్లలో కంటిన్యూగా 250 రోజులు ఆడింది. నువ్వే కావాలి సినిమా రిలీజై సోమవారం (అక్టోబర్ 13) నాటికి సరిగ్గా 25 ఏళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూస్తున్నారు.

అయితే నువ్వే కావాలి సినిమాకు హీరోగా తరుణ్ ఫస్ట్ చాయిస్ కాదట. ముందుగా మహేష్ బాబును హీరోగా అనుకున్నారట. అయితే అప్పటికే మహేష్ చేతిలో చాలా సినిమాలు ఉండడంతో ఈ కథపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో అక్కినేని సుమంత్ ను అప్రోచ్ అయ్యారట. అతను కూడా మరో మూవీతో బిజీగా ఉండడంతో ఇక మరో హీరో కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. అలా అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా 20 – 30 సినిమాల్లో నటించిన తరుణ్ ను హీరోగా సెలెక్ట్ చేశారట. ఇక ఇంటర్ చదివే టైంలో ఓ యాడ్‌లో నటించిన రిచాను చూసి హీరోయిన్‌గా ఎంపిక చేశారట.

నువ్వే కావాలి సినిమాతోనే తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో రెండో హీరోగా సాయి కిరణ్ నటించాడు. ఇక కోటి పాటలు, త్రివిక్రమ్ మాటలు నువ్వే కావాలి సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మరి ఈ సినిమా మహేష్ బాబు చేసి  ఉంటే రిజల్ట్ ఎలా ఉందేదో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?