Dhanush: ఫోక్ డ్యాన్సర్‌కు క్రేజీ ఛాన్స్.. ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్గా ఆఫర్..
ఈమధ్య కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు వచ్చే రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. తెలంగాణ పల్లె పాటలు ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తున్నాయి. అలాగే ఈ జానపదాలలో కనిపించే నటీనటులు సైతం పాపులర్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ అమ్మాయికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ ప్రపంచంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తున్నాయో చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా పల్లెపాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇందులో కనిపించే నటీనటులు సైతం పాపులర్ అవుతున్నారు. స్టార్ హీరోహీరోయిన్స్ రేంజ్ లో తమకంటూ సెపరేట్ ఫాలియింగ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో నాగదుర్గ ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు తెలియని వారుండరు. ఆమె యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలలో కనిపించి తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. దాదాపు మూడేళ్ల నుంచి ఫోక్ సాంగ్స్ చేస్తున్న నాగదుర్గ పేరు ఈ మధ్యకాలంలో మరింత మారుమోగుతుంది. ఆమె పాటలకు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి. ఆమెకు ఇదివరకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించింది. తాజాగా ఆమెకు క్రేజీ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్.. ఇదివరకు హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.. జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నారు పవీష్. ఇప్పుడు ఆయన రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఇందులో పవీష్ సరసన కథనాయికగా తెలుగు యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ నటిస్తుండడం విశేషం. ఇటీవల కలివి వనం సినిమాలో నటించిన నాగదుర్గ.. ఇప్పుడు కథానాయికగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
పవీన్ రెండో సినిమాకు కొత్త డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఆయన గతంలో తమిళంలో లక్ష్మణ్ దర్శకత్వంలో వచ్చిన బోగన్ సినిమా దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇక ఇప్పుడు దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?




