కొన్ని విమర్శలు.. కొన్ని పొగడ్తలు షాకింగ్ లుక్‌లో హీరో
కొందరు హీరోలు తమ సినిమాల కోసం చాలా కష్టపడతారు.ప్రేక్షకులను మెప్పించేందుకు కొత్తగా కనిపించేందుకు తమ శరీరాన్ని ఎంతైనా బాధ పెట్టుకుంటారు. అసరమైతే బరువు పెరుగుతారు. సన్నగా కూడా మారిపోతారు. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తారు. తాజాగా టాలీవుడ్ హీరో వర్వానంద్ తన లుక్ మొత్తం మార్చేశాడు. మరీ బక్కచిక్కిపోయి అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయాడు.
ప్రస్తుతం ఈ హీరో ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఫొటోల్లో హీరో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించినా మరీ పీలగా తయారైపోయాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక శర్వానంద్ హిట్ కొట్టి సుమారు మూడేళ్లవుతోంది. 2002లో వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా తర్వాత కేవలం ఒకే సినిమాలో నటించాడు శర్వా. గతేడాది రిలీజైన మనమే సినిమా ఓ మోస్తరుగా ఆడింది. అయితే ప్రస్తుతం ఈ ప్రామిసింగ్ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు శర్వానంద్. ఇది కాకుండా బైకర్ అనే ఓ స్పోర్ట్స్ డ్రామాలోనూ నటిస్తున్నాడు శర్వా. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లోనూ యాక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శర్వా లేటెస్ట్ గా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో సిక్స్ ప్యాక్ తో కనిపించినా మరీ బక్కచిక్కిపోయి ఉన్నాడు. దీంతో చాలా మంది మొదట అతనని గుర్తు పట్టలేదు. మొత్తానికి శర్వానంద్ సిక్స్ ప్యాక్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడాలి నాని.. ఇలా అయిపోయారేంటి ??
మొంథా ఎఫెక్ట్.. ఈ రూట్‌లో నడిచే 97 రైళ్లు రద్దు
బస్సు ప్రమాదాలపై సెలబ్రిటీలు అవగాహన కల్పించాల్సిందే
Suman: నాపై ఆ స్టార్ చేతబడి చేశారు.. కేరళ వెళ్లి మరీ విరుగుడు చేయించుకున్నా
Director Teja: పరోపకారం చేయబోతే.. రూ.కోటి ఫైన్ పడింది.. పాపం తేజ
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

