మొంథా ఎఫెక్ట్.. ఈ రూట్‌లో నడిచే 97 రైళ్లు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంథా తుపాను గా మారడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా దాదాపు 100 రైలు సర్వీసులను రద్దు చేశారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ అధికారులు మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ వర్షాల నేఫథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖ మూడు రోజుల పాటు విశాఖ మీదుగా రాకపోకలు సాగించే పలు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. రైల్వే శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్ల సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటూ రద్దు చేసిన రైల్వే సర్వీసుల జాబితాను రైల్వే శాఖ విడుదల చేసింది. దానితో పాటు ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు ట్రైన్ స్టేటస్‌ను చెక్‌చేసుకోవాలని సూచింది. తుఫాను తీవ్రతను బట్టి తరువాత సర్వీసులను పునరుద్దరిస్తామని రైల్వేశాఖ స్పష్టం చేసింది. రద్దైన రైళ్ల జాబితాలో సోమవారం విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరాల్సిన గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ వెళ్లాల్సిన గరీబ్‌రథ్, ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- తిరుపతి డబుల్‌డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సు ప్రమాదాలపై సెలబ్రిటీలు అవగాహన కల్పించాల్సిందే
Suman: నాపై ఆ స్టార్ చేతబడి చేశారు.. కేరళ వెళ్లి మరీ విరుగుడు చేయించుకున్నా
Director Teja: పరోపకారం చేయబోతే.. రూ.కోటి ఫైన్ పడింది.. పాపం తేజ
లైంగిక ఆరోపణలు కారణంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్
Allu Arjun: మాటల్లేవ్ అంతే..! ‘కాంతార’పై బన్నీ మాస్ రివ్యూ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

