Director Teja: పరోపకారం చేయబోతే.. రూ.కోటి ఫైన్ పడింది.. పాపం తేజ
తనను నమ్ముకున్నోళ్లకు..! తనకు నమ్మకం ఉన్నోళ్లకు సాయం చేసే అలవాటున్న తేజ.. ఓ సారి అలా సాయం చేస్తూనే దొరికిపోయాడట. దొకిరిపోవడమే కాదు.. ఓ వ్యక్తికి తాను చేసిన మాట సాయం కారణంగా ఏకంగా కోటి రూపాయలను నష్టపోయారట. ఇదే విషయాన్ని స్వయంగా తేజానే ఓ ఇంటర్వ్యూలో వివరించడంతో.. ఇప్పుడీయన సాయం.. అందుకు కోటి రూపాయలు క్షవర కావడం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. రాజమౌళితో చేసిన ‘సై’ సినిమా తర్వాత వరుస ప్లాప్స్ చవిచూశాడు నితిన్. సై తర్వాత నితిన్ వెంటనే చేసిన సినిమా ధైర్యం. దీన్ని తేజ డైరెక్ట్ చేశాడు. రియా సేన్ సిస్టర్ రీమా సేన్ హీరోయిన్‌గా నటించింది. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే సినిమా ఫలితాన్ని ముందుగానే ఊహించిన దర్శకుడు తేజ.. ఓ డిస్ట్రిబ్యూటర్‌తో మూవీ కొనొద్దని చెప్పారట. దీంతో ఆ డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనకుండా పక్కకు తప్పుకున్నాడు. సినిమా రిలీజ్ తర్వాత సదరు డిస్ట్రిబ్యూటర్.. విషయాన్ని నిర్మాతలకు తెలియజేశాడట. దీంతో విషయం సీరియస్ అయింది. దీంతో తేజ ఫైన్ కట్టాల్సి వచ్చింది. ధైర్యం కోసం తేజ రూ 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా.. అందులో ఒక కోటి ఫైన్ కింద కట్టాల్సి వచ్చిందట. అయితే ఇదే విషయంపై రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు డైరెక్టర్ తేజ. తన వద్దకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్‌కు వైఫ్ బాగుందా..? పిల్లలు బాగున్నారా..? సరే నీ ఇష్టం అన్నాను తప్పితే.. తాను ఇకేం చెప్పలేదని తేజ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఆ డిస్ట్రిబ్యూటర్‌ను సేవ్ చేద్దామనే ఉద్దేశ్యంతోనే అలా చెప్పానని కూడా ఒప్పుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లైంగిక ఆరోపణలు కారణంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్
Allu Arjun: మాటల్లేవ్ అంతే..! ‘కాంతార’పై బన్నీ మాస్ రివ్యూ
‘ఫౌజీ’ టైటిల్‌లో సంస్కృత శ్లోకాలు.. వాటి అర్థం ఏంటంటే
చనిపోయాడని నదిలో నిమజ్జనం.. 13 ఏళ్ల తర్వాత ఇంటికి.. ఏం జరిగింది
డీమ్యాట్ ఖాతాలో రూ. 2,817 కోట్ల సంపద.. కాసేపటికే అంకెలన్నీ మాయమై
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

