Adithya 369: ఆదిత్య 369 రీ రిలీజ్.. హీరోయిన్ మోహినీ ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా? గుర్తు పట్టలేరు
నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఆదిత్య 369 ఒకటి. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ టైమ్ ట్రావెల్ మూవీలో మోహినీ హీరోయిన్ గా నటించింది. 1991లో రిలీజై సంచలనం సృష్టించిన ఈ సినిమా మళ్లీ 34 ఏళ్ల తర్వాత థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.

నందమూరి బాలకృష్ణ నటించిన కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఆదిత్య 369 ముందుంటుంది. మన దేశంలో తెరకెక్కిన తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇదే కావడం విశేషం. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాలో బాలకృష్ణ కృష్ణకుమార్ అనే యువకుడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. 1991లో రిలీజైన ఆదిత్య 369 సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తెలుగు ఆడియెన్స్ కు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాను సుమారు 34 యేళ్ల తర్వాత థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈసారి 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరిన్ని సొబగులు అద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 04) ఆదిత్య 369 సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ ప్రియురాలిగా మోహినీ అలియాస్ అలియాస్ మహాలక్ష్మి శ్రీనివాసన్ నటించింది. ఆమెకు తెలుగులో ఇదే మొదటి సినిమా. అయితేనేం చలాకీ అమ్మాయిగా తెలుగు ఆడియెన్స్ మనసులు కొల్లగొట్టింది. మరి ఆదిత్య 369 రీ రిలీజ్ నేపథ్యంలో మోహినీ ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసుకుందాం రండి.
తమిళనాడులోని తంజావూరులో జన్మించిన మోహినీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 1991లో ఈరమన రోజావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆదిత్య 369 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ అందాల తార. ఆ తర్వాత డిటెక్టివ్ నార, మామ బాగున్నావ్, హిట్లర్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయం పరంగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగలేకపోయింది మోహిని. 2011లో చివరి సారిగా వెండి తెరపై కనిపించిందీ ముద్దుగుమ్మ.
ఫ్యామిలీతో అలనాటి హీరోయిన్ మోహినీ

Actress Mohini
కాగా సినిమా అవకాశాలు వస్తున్న సమయంలోనే భరత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది మోహినీ. ఆతర్వాత ఇద్దరూ అమెరికాకు వెళ్లిపోయి అక్కడే సెటిలయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే కొన్నేళ్లకు వ్యక్తిగత కారణాలతో భర్తతో విడాకులు తీసుకుంది మోహినీ. ప్రస్తుతం ఆమె సింగిల్ మదర్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. అలాగే క్రైస్తవ మత బోధకురాలిగా వివిధ ప్రచార కార్యక్రమాల్లో నూ పాల్గొంటోంది. సినిమాల్లో సన్నగా నాజూకుగా కనిపించిన మోహిని ఇప్పుడు మాత్రం కాస్త బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తోంది. అయితే ఆమె అందం ఏమాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు.
బొద్దుగా మారినా ముద్దుగానే.. మోహినీ లేటెస్ట్ ఫొటోస్..

Actress Mohini 1
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.