Balakrishna : బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఆ విషయంలో తొలి టాలీవుడ్ హీరోగా రికార్డ్..
నందమూరి బాలకృష్ణ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. తాజాగా బాలయ్యకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు చేరింది.

నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు చేరింది. ఈ సందర్భంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి తెలుగు హీరోగా ఆయన నిలిచారు. ఇటీవలే నటుడిగా ఆయన సినీప్రయాణం 50 ఏళ్లు పూర్తైన సంగతి తెలిసిందే. గత 50 సంవత్సరాలుగా హీరోగా వెండితెరపై అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్యా. ఇప్పటికీ హీరోగానే వరుస హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ మేరకు ఆయన ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 30న హైదరాబాద్ లో ఆయనను సత్కరించనున్నారు. ఈ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు ఆయన కుమార్తె బ్రహ్మాణి, నటుడు నారా రోహిత్ తదితరులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..
ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయన నటించిన భగవంత్ కేసరి చిత్రానికి జాతీయ అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 1974లో తాతమ్మ కల సినిమాతో నటుడిగా సినీప్రయాణం స్టార్ట్ చేశారు బాలకృష్ణ. ఆ త్రవాత మంగమ్మగారి మనవడు, సీతారామ కల్యాణం, సమరసింహారెడ్డి , నరసింహనాయుడు, సింహా, లెజెండ్, అఖండ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, మాస్ యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..
ఇదంతా పక్కనపెడితే సినీరంగానికి ఆయన చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ పురస్కారాన్ని బాలకృష్ణ కొన్ని నెలల క్రితమే అందుకున్నారు. ఇక 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. తాజాగా ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..







