Tollywood: ఏంటి అమ్మడూ నువ్వూ పాలిటిక్స్‌లో చేరావా? జయప్రదతో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార బిజినెస్ వ్యవహారాలతో బిజి బిజీగా ఉంటోంది. ఓ కంపెనీని రన్ చేస్తోన్న ఈ బ్యూటీ ఫిల్మ్ ప్రొడక్షన్, ఈవెంట్ ప్రమోషన్, స్పోర్ట్స్ ప్రమోషన్స్ లాంటి ఫీల్డ్స్‌లో వర్క్ చేస్తోంది. అలాంటి ఈ అమ్మడు ఇప్పుడు ఇలా..

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఇందులో ప్రముఖ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద కూడా హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. రాజస్థాన్‌లోని వైశాలి నగర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె మువ్వన్నెల జెండా పట్టుకుని ఊరంతా తిరిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. అయితే ఈ ఫొటోలు, వీడియోల్లో జయప్రద పక్కనే మరో టాలీవుడ్ హీరోయిన్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో పలు తెలుగు సినిమాల్లో కథానాయికగా నటించిన ఆమె మువ్వెన్నెల జెండాను మెడలో వేసుకొని మరొక జెండాను చేత్తో పట్టుకుని ర్యాలీలో పాల్గొంది. మరి ఆమె ఎవరో మీరు గుర్తు పట్టారా? తను మరెవరో కాదు పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు హీరోయిన్ ప్రీతి జింగానియా.
తమ్ముడు సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ప్రీతి. ఆ తర్వాత బాలకృష్ణ నరసింహనాయుడు, మోహన్ బాబు అధిపతి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్, ఆనందమానందమాయే సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగలో ఓ స్పెషల్ సాంగ్ లో తళుక్కుమంది. తెలుగులో ఇదే ప్రీతికి చివరి సినిమా. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైపోయింది.
పవన్ కల్యాణ్ తమ్ముడు హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
సినిమాల్లో ఉండగానే 2008లో నటుడు, మోడల్ పర్వీన్ దబాస్‌ని పెళ్లి చేసుకుంది ప్రీతి. ప్రస్తుతం వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక సినిమాలకు దూరంగా ఉన్న ప్రీతి భర్తతో కలిసి ‘స్వెన్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే కంపెనీని నిర్వహిస్తోంది. . ఈ కంపెనీ ఫిల్మ్ ప్రొడక్షన్, ఈవెంట్ ప్రమోషన్, స్పోర్ట్స్ ప్రమోషన్స్ లాంటి ఫీల్డ్స్‌లో వర్క్ చేస్తోంది. అంతేకాదు ప్రీతి ‘ప్రో పంజా లీగ్’ అనే ఆర్మ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌కు కో-ఫౌండర్‌గా కూడా ఉంటోంది. అయితే ఉన్నట్లుండి ఈ అమ్మడు ఇలా ర్యాలీలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
జయప్రదతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ప్రీతి జింగానియా..
View this post on Instagram







