OTT Movie: నొటోరియస్ బికినీ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్‌ను ఎలా పట్టుకున్నారు? ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ..
చార్లెస్ శోభరాజ్.. ఈ కరుడుగట్టిన నరహంతకుడి గురించి చాలా మంది వినే ఉంటారు. సీరియల్ బికినీ కిల్లర్ గా గుర్తింపు పొందిన అతను కొన్నేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించాఉ . మరి అలాంటి నొటోరియస్ సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకున్నారన్నదే ఈ సినిమా కథ.

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథ ల ఆధారంగా సినిమలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. సీరియల్ బికినీ కిల్లర్ శోభరాజ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగ ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. సుమారు 20కు పైగా హత్యలు చేశాడు శోభరాజ్..కానీ మర్డర్ చేశాక తెలివిగా తప్పించుకోవడం ఈ సీరియల్ కిల్లర్ కున్న ప్రత్యేక శైలి. కారణమేంటో తెలియదు కానీ.. కాలినడకన తిరిగే పర్యాటకులనే టార్గెట్ గా చేసుకుని నేరాలకు పాల్పడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 మంది టూరిస్టులను దారుణంగా చంపాడు. అందులో ఒక్క థాయ్‌లాండ్‌లోనే 14 మందిని హతమార్చాడు. మృతుల్లో చాలామంది బికినీలో శవాలుగా కనిపించడంతో అతనికి బికినీ కిల్లర్ అనే ముద్రపడింది. మరి అలాంటి చార్లెస్ శోభరాజ్ ను ఎలా వల వేసి పట్టుకున్నారు? ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్నదే ఈ సినిమా కథ.
ఈ రియల్ క్రైమ్ స్టోరీలో కుబేర నటుడు జిమ్ సర్భ్ సీరియల్ కిల్లర్ పాత్రను పోషిస్తున్నాడు. అయితే సినిమాలో ఈ పాత్ర పేరు కార్ల్ భోజ్‌రాజ్ గా పెట్టడం గమనార్హం. అటు డిటెక్టివ్ మధుకర్ జెండె పాత్రలో ఫ్యామిలీ మ్యాన్ హీరో మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్నాడు. బాలచంద్ర కదమ్, సచిన్ ఖేడ్కర్, గిరిజా ఓక్, హరీష్ దుదాడేలాంటి వాళ్లు కూడా ఈ మూవీలో నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 05 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
నెట్ ఫ్లిక్స్ లో ఇన్ స్పెక్టర్ జెండే స్ట్రీమింగ్..
Inspector Zende is on duty soon. 🚨 Time’s up for Interpol’s most wanted 👀 Watch Inspector Zende, out 5 September, only on Netflix.#InspectorZendeOnNetflix pic.twitter.com/iwTMyb2PCL
— Netflix India (@NetflixIndia) August 22, 2025
ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఓం రౌత్ ఇన్ స్పెక్టర్ జెండే సినిమాను నిర్మించడం విశేషం. చిన్మయ్ మండ్లేకర్ దర్శకత్వం వహించారు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి ఇన్ స్పెక్టర్ జెండే ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




