Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి మైక్ టైసన్, అండర్ టేకర్! రెమ్యునరేషన్స్ ఏ మాత్రం ఉండొచ్చంటే?
బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే మలయాళంలో ఈ రియాలిటీ షో కొత్త సీజన్ షురూ అయ్యింది. తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ హిందీలో ఇప్పటికే 18 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. 19వ సీజన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అవును.. ఈ బిగ్ బాస్ 19 రియాలిటీ షో ఆగస్టు 24న ప్రసారం కానుంది. సల్మాన్ ఖాన్ దీనికి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు ప్రవేశిస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆశ్చర్యకరంగా, WWE ఫేమ్ అండర్‌టేకర్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. WWE చూసే ప్రతి ఒక్కరికీ ది అండర్‌టేకర్ బాగా తెలుసు. అతను 30 సంవత్సరాలకు పైగా ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో పాల్గొన్నాడు. 2020 లో అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. ది అండర్‌టేకర్ WWE రంగంలో తనదైన ముద్ర వేశాడు. అందువల్ల అతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ‘బిగ్ బాస్ 19’ షోకి అండర్‌టేకర్‌ను ఆహ్వానించడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం, బిగ్ బాస్ నిర్వాహకులు అండర్‌టేకర్‌తో చర్చలు జరిపారు. అయితే అతను నేరుగా కాకుండా వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతాడని చెబుతున్నారు. కానీ దీని గురించి ఎవరూ అధికారికంగా ప్రకటన చేయలేదు.
బిగ్ బాస్ హౌస్ కు అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖులను తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను కూడా బిగ్ హౌస్ కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమాలో మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో నటించారు.
కాగా ప్రస్తుతం మైక్ టైసన్, అండర్ టేకర్ లకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పై చర్చలు కొనసాగుతున్నాయి. బిగ్ బాస్ ప్రతి సీజన్ ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త అనుభూతిని పంచుతోంది. ఈసారి కూడా కొన్ని కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అందుకే ఈరియాలిటీ షోల్లో ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. బిగ్ బాస్ కలర్స్ టీవీ, జియో హాట్ స్టార్‌లో ప్రసారం అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








