AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 800కు పైగా సినిమాలు.. బిస్లరీ వాటర్‌తో స్నానం.. అస్తులన్నీ దానం చేసి కన్నుమూసిన టాలీవుడ్ నటి

తెలుగు, మలయాళం, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 800కు పైగా సినిమాల్లో నటించారీ అందాల తార. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా.. అటుపై సపోర్టింగ్‌ రోల్స్‌, అక్క, చెల్లి, అమ్మ, అత్త ఇలా అన్ని పాత్రలను పోషించి టాలీవుడ్ లో దిగ్గజ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Tollywood: 800కు పైగా సినిమాలు.. బిస్లరీ వాటర్‌తో స్నానం.. అస్తులన్నీ దానం చేసి కన్నుమూసిన టాలీవుడ్ నటి
Tollywood Senior Actress Srividya
Basha Shek
|

Updated on: Aug 22, 2025 | 8:54 PM

Share

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా కెరీర్ ప్రారంభించింది. ఆపై హీరోయిన్‌గానూ ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో స్టార్ హీరోలకు మించి క్రేజ్ సొంతం చేసుకుంది. అటుపై సపోర్టింగ్‌ రోల్స్‌ తోనూ మెప్పించింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి సుమారు 800 కు పైగా సినిమాల్లో నటించిందీ అందాల తార. కేవలం నటనతోనూ తన గాత్రంతోనూ అలరించిందీ ముద్దుగుమ్మ. పలు సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది. ఇలా భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె రియల్ లైఫ్ లో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది. కట్టుకున్న భర్త ప్రేమ కోసం కాకుండా ఈ నటి ఆస్తుల కోసం పట్టుబట్టాడు. చివరకు వేరొకరిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఈ నటి కోర్టు కెళ్లి మరీ భర్త నుంచి తన ఆస్తులను వెనక్కు తీసుకుంది. అయితే 2003లో క్యాన్సర్ బారిన పడిందీ అందాల తార. సుమారు మూడేళ్ల పాటు చికిత్స తీసుకుంది. కానీ మహమ్మారి మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. ఫోర్త్‌ స్టేజ్‌లో వచ్చాక ఇక తాను బతకడం కష్టమనే విషయం నటికి అర్థమైయ్యింది. అందుకే తన పేరు మీద ఒక్క రూపాయి కూడా ఉండొద్దనుకుంది. అందులో భాగంగానే తన ఆస్తిపాస్తులన్నింటినీ సేవాకార్యక్రమాలకు, చారిటబుల్ ట్రస్టులకు దానంగా ఇచ్చేసి శాశ్వతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించింది. తాను చనిపోయినా ఎంతో మంది పేదలు, అనాథల జీవితాల్లో వెలుగు నింపిన ఆ అందాల తార మరెవరో కాదు శ్రీ విద్య.

క్యాన్సర్ తో సుమారు మూడేళ్ల పోరాడిన శ్రీ విద్య 2006, ఆగస్టు 17న కన్నుమూసింది. అప్పటికి ఆమె వయసు కేవలం 53 ఏళ్లు మాత్రమే. కాగా ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు అవుట్‌డోర్‌ షూటింగ్‌లో భాగంగా రాజమండ్రి దగ్గరలోని ఓ గ్రామానికి వెళ్లింది శ్రీ విద్య. అక్కడ ఉండటానికి ఏర్పాట్లు బాగానే ఉన్నా, స్నానాలు మాత్రం పక్కనే ఉన్న గోదావరి నీళ్లతోనే చేయాల్సి వచ్చింది. అప్పుడు వరదల కారణంగా నీరు కొంచెం బురదగా మారింది. అయితే ఒక రకమైన కాయను అరగదీసి కలిపితే బురద కిందకు పోయి, స్వచ్ఛమైన నీరు పైకి తేలేది. సినిమా సెట్ లోని సహాయకులు ఆ నీరే పట్టి నటీనటులకి స్నానానికి అందించేవారు. అయితే శ్రీ విద్య మాత్రం ఆ నీటితో స్నానం చేసేందుకు ససేమిరా అందట. ఎంత తేటగా ఉన్నా, ఈ నీటితో స్నానం చేస్తే, తన శరీర సొగసు పాడవుతుందని, ఆరోగ్యం దెబ్బ తింటుందని పేచీ పెట్టిందట. దీంతో అందరికీ తాగడానికి ఇస్తున్న ‘బిస్లరీ’ నీటిని తెప్పించి, బకెట్లలో నింపి ఆమెకు ఇచ్చారట. బిస్లరీ వాటర్‌ అప్పుడే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చింది. అప్పుడు లీటరు సీసా ఆరు రూపాయాలు. అలాంటి సీసాలు రెండు బకెట్లకి సరిపడా చిత్ర నిర్మాతలు తెప్పించి రెండు పూటలా శ్రీవిద్య స్నానానికి అందించారట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పట్లో శ్రీ విద్య స్టార్ డమ్ ఎలా ఉండేదో..

ఇవి కూడా చదవండి
Senior Actress Sri Vidya

Senior Actress Sri Vidya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి