AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Screen Awards: సినీ దిగ్గజాలకు యూట్యూబ్ వేదికగా ‘స్క్రీన్ అవార్డ్స్ 2025’.. పూర్తి వివరాలివే

యూట్యూబ్ సహకారంతో తొలిసారిగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ వేడుక కోసం మొదటి సారిగా బాలీవుడ్ సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్స్ ఒకే వేదికపైకి రానున్నారు. రెడ్ కార్పెట్, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ వంటివి మూడు నెలల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో భాగం కానున్నాయి

Screen Awards: సినీ దిగ్గజాలకు యూట్యూబ్ వేదికగా ‘స్క్రీన్ అవార్డ్స్ 2025’.. పూర్తి వివరాలివే
Screen Awards 2025
Basha Shek
|

Updated on: Aug 22, 2025 | 9:25 PM

Share

భారతీయ సినీ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘స్క్రీన్ అవార్డ్స్’ 2025 నుంచి సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌తో చేతులు కలిపి ఈ అవార్డుల వేడుకను డిజిటల్-ఫస్ట్‌గా నిర్వహించనుంది. ఈ కొత్త ఒరవడి భారతీయ సినిమా వేడుకలకు సాంస్కృతిక, డిజిటల్ ప్రపంచాలను కలిపి సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించనుంది. ఈ అవార్డులు కేవలం ఒక సాధారణ వేడుక మాత్రమే కాదు, పత్రికా విలువలు, సాంస్కృతిక వారసత్వం, డిజిటల్ పరిధిల కలయిక అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ తెలిపింది. ఈ అవార్డులకు అవార్డ్స్ అకాడమీ అనేది ఒక స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థగా వ్యవహరిస్తుంది. ఇందులో ప్రముఖ దర్శకులు, కళాకారులు, సాంస్కృతిక ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. వీరు నిజమైన ప్రతిభను, పనితీరును గుర్తించి విజేతలను ఎంపిక చేస్తారు.

ఈ సందర్భంగా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత గోయంకా మాట్లాడుతూ.. “భారతీయ సినిమా కేవలం కలెక్షన్ల కంటే మించి, సృజనాత్మకతను సెలబ్రేట్ చేసుకునే ఒక వేదిక అవసరం. కథకులు 1.4 బిలియన్ల కలలను మోస్తున్నారు. ఈ అవార్డులు ఆ స్ఫూర్తిని గౌరవిస్తాయి” అని అన్నారు. యూట్యూబ్ సహకారంతో, ఈ అవార్డులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ వేడుకలో తొలిసారిగా బాలీవుడ్ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్స్ ఒకే వేదికపైకి రానున్నారు. రెడ్ కార్పెట్, తెర వెనుక దృశ్యాలు, క్రియేటర్ల స్టోరీలు, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ వంటివి మూడు నెలల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో భాగం కానున్నాయి. ఈ కొత్త విధానం ప్రేక్షకులు వినోదాన్ని ఎలా చూస్తున్నారనే దానిలో వచ్చిన మార్పును ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం, కనెక్టెడ్ టీవీ (CTV)ల వాడకం పెరగడం, మొబైల్ వినియోగం గణనీయంగా పెరగడం వంటివి ఈ మార్పుకు కారణాలు. ముఖ్యంగా, యూట్యూబ్‌కు CTV గత ఐదేళ్లుగా భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్క్రీన్‌గా నిలిచింది. ఇది సినిమా వేడుకకు డిజిటల్ కథాకథనానికి మధ్య వారధిగా నిలుస్తుంది.

ఈ సహకారంపై యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గుంజన్ సోని మాట్లాడుతూ, “యూట్యూబ్ ‘స్క్రీన్ అవార్డ్స్’ కు డిజిటల్ వేదిక అయినందుకు మేము సంతోషిస్తున్నాం. సినిమా అభిమానులు ఈ గొప్ప వేడుకను తమకు నచ్చిన విధంగా ఆస్వాదిస్తారు” అని అన్నారు. 1995లో స్థాపితమైన ‘స్క్రీన్ అవార్డ్స్’ కు ఎన్నో విశేషాలు ఉన్నాయని, ఇవి భారతదేశంలో మొట్టమొదటి జ్యూరీ-ఆధారిత ఫిల్మ్ అవార్డ్స్ అని, నేటి సూపర్ స్టార్లలో చాలా మందికి తొలి అవార్డు ఇదేనని స్క్రీన్ అవార్డ్స్ క్యూరేటర్ ప్రియాంక సిన్హా ఝా తెలిపారు. యూట్యూబ్‌తో కలిసి మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని ఆమె అన్నారు. ఈ సహకారం గురించి మరిన్ని వివరాల కోసం vineet.singh@indianexpress.com ను సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే