AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: భర్త ఉండగానే మరొకరితో.. ఓటీటీలో థ్రిల్లింగ్ రియల్ క్రైమ్ స్టోరీ.. పిల్లలతో కలిసి చూడొద్దు

ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. భార్య, భర్తల మధ్య ఓ ఎమోషనల్ డెప్త్ ఉంది. అలాగే గ్యాంగ్ స్టర్ కథ కావడంతో యాక్షన్ ప్రియులకు కూడా తెగ నచ్చుతుంది. ఇక సినిమా సాగుతున్న కొద్దీ వచ్చే ట్విస్టులు మాత్రంనెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.

OTT Movie: భర్త ఉండగానే మరొకరితో.. ఓటీటీలో థ్రిల్లింగ్ రియల్ క్రైమ్ స్టోరీ.. పిల్లలతో కలిసి చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 22, 2025 | 7:55 PM

Share

ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలకు రీచ్ ఎక్కువ. ఇతర జానర్లతో పోలిస్తే ఓటీటీ ఆడియెన్స్ వీటిని ఎక్కువగా చూస్తున్నారు. అందులోనూ మలయాళం సినిమాలకైతే ఓ రేంజ్ లో ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమా కథ అని అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను హిమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అని భరతన్ అనే గ్యాంగ్ స్టర్ దగ్గర పని చేస్తుంటాడు. క్రైమ్ కార్యకలాపాలు సాగించే భరతన్ దగ్గర పని ఒత్తిడితో అని సతమతమవుతాడు. ఇది క్రమంగా అతని వైవాహిక బంధాన్ని దెబ్బ తీస్తుంది. ధనవంతుల కుటుంబానికి చెందిన హిమ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది. ఇదే క్రమంలో ఓ హత్య కేసులో కూడా ఇరుక్కుంటుంది. దీంతో అని-హిమల వైవాహిక జీవితం కష్టాల్లో పడుతుంది.

మరోవైపు భరతన్ నేర కార్యకలాపాలు మరింత పెరిగిపోతాయి. ఇందులో అని కూడా ఇన్వాల్వ్ అవుతాడు. అలాగే భరతన్ గ్రూప్ లో కొందరు అనీని టార్గెట్ చేస్తారు. ఇలా గ్యాంగ్ వార్, మోసాలలు అనీని మరింత డేంజర్ లో పడేస్తాయి. మరి ఈ చిక్కుముడుల నుంచి అనీ ఎలా బయట పడ్డాడు. తన భార్యను ఎలా కాపాడుకున్నాడు? అనేది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ మలయాళం సినిమా పేరు ఉడుంబ్. కన్నన్ తమరక్కులం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సెంతిల్ కృష్ణ, హరీష్ పెరడి, అలెన్సియర్ లే లోపెజ్, ఏంజెలినా లైసన్, ప్రియాంక శ్రీలక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా తెలుగులోనూ ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ర్యాంబో పేరుతో అనౌన్స్ మెంట్ కూడా జరిగింది. కానీ ఎందుకో కానీ  ఆ తర్వాత ఈ మూవీ పత్తా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఈ ఉడుంబు సినిమా సన్ నెక్ట్స్ తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఉడుంబ్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం