AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Agnipariksha: అరే.. ఎంత పనైంది.. నిరాహార దీక్ష చేసిన మల్టీ స్టార్‌ మన్మధ రాజాను బయటకు పంపించేశారుగా..

థియేటర్ల ముందు మూవీ రివ్యూలు చెబుతూ.. మినిమమ్ డిగ్రీ ఉండాలి అనే డైలాగ్ తో పాపులర్ అయ్యాడు ఖాతోజ్ రామాచారి అలియాస్ మల్టీస్టార్ మన్మధరాజా. ఇక బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్షకు దిగాడీ మన్మధ రాజా.

Bigg Boss Agnipariksha: అరే.. ఎంత పనైంది.. నిరాహార దీక్ష చేసిన మల్టీ స్టార్‌ మన్మధ రాజాను బయటకు పంపించేశారుగా..
Bigg Boss Telugu Season 9
Basha Shek
|

Updated on: Aug 23, 2025 | 8:50 PM

Share

బిగ్ బాస్ లో ఛాన్స్ కావాలంటూ ఏకంగా అన్న పూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష చేశాడు ఖాతోజ్ రామాచారి అలియాస్ మల్టీస్టార్ మన్మధరాజా. అంతకు ముందు థియేటర్ల ముందు మూవీ రివ్యూలు చెబుతూ.. మినిమమ్ డిగ్రీ ఉండాలి అనే డైలాగ్ తో పాపులర్ తో ఒక్క సారిగా ఫేమస్ అయ్యాడితను. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం ఎవరిని అడగాలి అనేది తనకు తెలియదంటూ అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష కు దిగాడు. ఇలాగైనా తన గురించి నాగార్జున సార్ కి తెలుస్తుందంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. అతను కోరుకున్నట్లు గానే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో రామాచారికి ఛాన్స్ వచ్చింది. కానీ దానిని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జడ్జీలను విసిగించి చిరాకు తెప్పించాడు. ఫలితంగా అతనికి బిగ్ బాస్ షో నుంచి గేట్ పాస్ ఇచ్చేశారు.

బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వేదికపైకి రాగానే ఓవరాక్షన్ చేశాడు రామాచారి. శ్రీముఖి కాళ్లపై పడి బిగ్ బాస్ లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం అంటూ వేడుకున్నాడు. ఆ తర్వాత తన కష్టాలన్న జడ్జీల ముందు ఏకరువు పెట్టాడు. తాను నల్గొండ జిల్లాకి చెందిన వాడిని అని.. అమ్మా నాన్న ఎవరూ లేరు, ఆస్తులు కూడా లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకి పెళ్లి చేసే వాళ్లు కూడా లేరని సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. దీంతో జడ్జీలకు చిర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు నీ ఏడుపు పెళ్లి కాలేదనా? లేక మేము ఏమైనా నీకు పెళ్లి చేయాలా ఏంటి అంటూ నవదీప్, బిందుమాధవి మన్మధరాజాపై సెటైర్లు వేశారు. అసలు తన ట్యాలెంట్ ఏంటో చెప్పకుండా షో మొత్తం ఏడుస్తూ ఉండడంతో రామాచారి బిహేవియర్ జడ్జీలకు ఏ మాత్రంనచ్చలేదు. దీంతో ‘మీరు బిగ్ బాస్ కు సూట్ అవ్వరు బాస్’ అంటూ నవదీప్, బింధు మాధవి, అభిజిత్ రామాజారికి రెడ్ ఫ్లాగ్ చూపించారు. దీనితో అతను ఏడ్చుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ అగ్ని పరీక్ష లేటెస్ట్ ప్రోమో..

సెప్టెంబర్ రెండో వారంలో బిగ్ బాస్ షో లాంఛింగ్!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..