Mahesh Vitta: తండ్రైన టాలీవుడ్ కమెడియన్.. పండంటి బిడ్డను ప్రసవించిన మహేశ్ భార్య.. ఫొటో వైరల్
రాయలసీమ ప్రాంతానికి చెందిన మహేష్ విట్టా యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. షార్ట్ ఫిల్మ్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ఫన్ బకెట్ వీడియోలు మహేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇదే ఫేమ్ తో సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాడు.

టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టా శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. మహేశ్ భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు మహేష్. ఈ సందర్భంగా పిల్లాడి చేతులను పట్టుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడీ కమెడియన్. ‘డర్టీ డైపర్స్, ఇక నిద్రలేని రాత్రులు ప్రారంభమయ్యాయి’ అంటూ తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మహేష్ విట్టా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ 2023 సెప్టెంబర్ లో శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కాడు. వీరిది ప్రేమ వివాహం. చెల్లెలు ఫ్రెండ్ అయిన శ్రావణినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడీ నటుడు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. ఇక తమ ప్రేమ బంధానికి ప్రతీకగా కొన్నినెలల క్రితం తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టాడు మహేష్. గత నెలలో శ్రావణికి ఘనంగా సీమంతం నిర్వహించి అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా పోస్ట్ చేశాడు. ఇప్పుడు తన భార్య పండంటి మగబిడ్డను ప్రసవించిందంటూ శుభవార్త పంచుకున్నాడు.
యూట్యూబ్ వీడియోలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న మహేశ్ విట్టా తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్, ఇందు వదన తదితర సినిమాల్లో కమెడియన్ గా కడుపుబ్బా నవ్వించాడు. ఇక బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ షో బిగ్‌బాస్ లో ఏకంగా రెండుసార్లు పాల్గొన్నాడు. బిగ్‌బాస్ 3వ, ఓటీటీ సీజన్‌లోనూ సందడి చేసిన మహేశ్ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటున్నాడు. మెగా ఫోన్ పట్టి ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడని తెలుస్తోంది.
మహేష్ విట్టా ఎమోషనల్ పోస్ట్..
View this post on Instagram
భార్య సీమంతం వేడుకలో మహేష్..
View this post on Instagram
సతీమణి శ్రావణి రెడ్డితో టాలీవుడ్ కమెడియన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








