AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Ajay: ఈ టాలీవుడ్ విలన్‌ భార్య ‘మిసెస్‌ ఇండియా’ ఫైనలిస్ట్ అని తెలుసా? అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అజయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు ఇరవై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడీ నటుడు. విలన్‌గా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే అజయ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు.

Actor Ajay: ఈ టాలీవుడ్ విలన్‌ భార్య ‘మిసెస్‌ ఇండియా' ఫైనలిస్ట్ అని తెలుసా? అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు
Ajay Family
Basha Shek
|

Updated on: Aug 23, 2025 | 8:41 PM

Share

రవితేజ హీరోగా నటించిన ‘విక్రమార్కుడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్. అందులో అతను పోషించిన టిట్లా పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆర్య 2, దూకుడు, రాజన్న, ఇష్క్, గబ్బర్ సింగ్, అల వైకుంఠ పురం, సరిలేరు నీకెవ్వరు, 18 పేజీస్‌,విరూపాక్ష, పుష్ప, సరిపోదా శనివారం, మారుతీ నగర్ సుబ్రమణ్యం, గుంటూరు కారం, మత్తు వదలరా 2, దేవర పార్ట్-1, పుష్ప 2, మజాకా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు అజయ్. సారాయి వీర్రాజు సినిమాతో హీరోగా అదృష్టం పరీక్షించుకున్న అజయ్ గతేడాది ఏకంగా 10 సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది ఇప్పటికే అతను నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమాల పరంగా అజయ్ ఎంత బిజీగా ఉంటున్నాడో. అయితే అజయ్ సినిమాల సంగతి పక్కన పెడితే.. అతని ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. అజయ్ భార్య, పిల్లలు కూడా పెద్దగా బయట కనిపించరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. టూర్లు, వెకేషన్స్ కు వెళ్లినప్పుడల్లా అజయ్ తో పాటు ఆయన భార్య, పిల్లల ఫొటోస్ ను షేర్ చేస్తుంటారు. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. అజయ్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉందని, అతని భార్య హీరోయిన్ కు ఏ మాత్రం తక్కువ కాదంటూ స్పందిస్తుంటారు. అవును అజయ్ భార్య అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు.

శ్వేతను రెండు సార్లు పెళ్లి చేసుకున్న అజయ్..

అజయ్ భార్య పేరు శ్వేత రావూరీ. వీరిదిప్రేమ వివాహం. కాలేజ్ సమయంలో శ్వేతా రావూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అజయ్. మొదట సీక్రెట్ గా ఆర్య సమాజ్ లో అజయ్- శ్వేత పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మరోసారి పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లయ్యాక కూడా మోడలింగ్ లో సత్తా చాటింది శ్వేతా. 2017 సంవత్సరంలో మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో ఫైనల్ దాకా వచ్చింది. ఆ మరుసటి ఏడాదే 2018 సంవత్సరంలో అంబాసిడర్ మిస్టర్ అండ్ మిసెస్ సౌత్ ఇండియాగా కూడా ఎంపికైంది. ఇక అజయ్-శ్వేతలకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

భార్య, పిల్లలతో నటుడు అజయ్..

సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది తల, మజాకా, భైరవం సినిమాల్లో నటించాడు అజయ్. ఇక నారా రోహిత్ హీరోగా నటించన సుందర కాండలోనూ ఓ కీ రోల్ పోషించాడు. త్వరలోనే ఈ మూవీ కూడా రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.