Allu Sirish: నితిన్ భార్య వల్లే అల్లు శిరీష్ పెళ్లి.. లవ్ స్టోరీ బయటపెట్టిన అల్లు వారబ్బాయి..
త్వరలోనే అల్లు వారింట్లో పెళ్లి భజాలు మోగనున్నాయి. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అల్లు శిరీష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయితో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు అనేక మంది సినీప్రముఖులు, సెలబ్రెటీలు హాజరయ్యారు. తాజాగా తన ప్రేమకథను బయటపెట్టారు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అల్లు శిరీష్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు. ఇటీవలే తాను ఓ అమ్మాయిని ప్రేమించానని సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 31న హైదరాబాద్ లోని అల్లు అరవింద్ నివాసంలో అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సందడి చేశారు. ఇక తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు అల్లు శిరీష్. అలాగే నయనికతో తన లవ్ స్టోరీని బయటపెట్టారు. దాదాపు రెండేళ్ల క్రితం తనకు కాబోయే భార్య నయనికను చూశానని అసలు విషయం చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
హీరో నితిన్, ఆయన భార్య షాలినితో కలిసి దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ లవ్ స్టోరీ చెప్పుకొచ్చారు. 2023లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోగా.. నితిన్, షాలిని వాళ్ల పెళ్లికి స్పెషల్ పార్టీ హోస్ట్ చేశారు. ఆ పార్టీకి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా హాజరైంది. మొదటిసారి నేను నయనికను అక్కడే కలిశాను. రెండేళ్ల తర్వాత మేము హ్యాపీగా నిశ్చితార్థం చేసుకుంటున్నాము. నా పిల్లలు నా ప్రేమకథ గురించి అడిగితే వాళ్ల అమ్మను ఎలా కలిసానో చెప్తాను. నయనిక ఫ్రెండ్స్ కు చాలా థ్యాంక్స్. నన్ను కూడా మీ గ్రూప్ లోకి తీసుకుని మొదటి రోజు నుంచి దగ్గర చేసుకున్నందుకు అంటూ రాసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
మరోవైపు నితిన్ భార్య షాలిని సైతం అల్లు శిరీష్, నయనిక ఎంగేజ్మెంట్ ఫోటోను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. మీ బ్యూటీఫుల్ స్టోరీలో నేను భాగమయినందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేయగా.. శిరీష్ రిప్లై ఇస్తూ.. థాంక్యూ పెళ్లి పెద్ద అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఇప్పుడు అల్లు శిరీష్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే అల్లు శిరీష్, నయనికల పెళ్లి తేదీని ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?




