Samantha: ‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’.. సమంత షాకింగ్ కామెంట్స్
గతంలో కంటే ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించేసింది స్టార్ హీరోయిన్ సమంత. అదే సమయంలో వేరే విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ నిడుమోరుతో సామ్ ప్రేమలో ఉందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.

కొన్ని రోజుల క్రితం శుభం సినిమాతో ఆడియెన్స్ ను పలకిరించింది స్టార్ హీరోయిన్ సమంత. నిర్మాతగా ఇది ఆమెకు మొదటి సినిమా కావడం గమనార్హం. ప్రస్తుతం బాలీవుడ్ లో రక్త్ బ్రహ్మాండ్ అనే సినిమా చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఫేమ్ స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది సామ్. మా ఇంటి బంగారం అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సినిమాల సంగతి పక్కన పెడితే బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడుమోరుతో సామ్ ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నో సందర్భాల్లో జంటగానే కనిపించారు సామ్- రాజ్. ఇటీవల కలిసే దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తమ ప్రేమ బంధంపై అటు సామ్ కానీ, ఇటు రాజ్ కానీ నోరు విప్పడం లేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే విడాకులు, మయోసైటిస్ సమస్యలపైనా స్పందించింది.
‘కెరీర్ పరంగా నేను చాలా ఒడిదొడికులను ఎదుర్కొన్నాను. నేను కష్టాల్లో ఉన్న సమయంలో కొందరు నా పరిస్థితి చూసి సంబరాలు చేసుకున్నారు. నవ్వుకున్నారు. నాకు మాయోసైటిస్ వ్యాధి వచినప్పుడు నన్ను ఎగతాళి చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అలాగే నా విడాకుల సమయంలోనూ వాళ్లు సంబరాలు చేసుకున్నారు. అవన్నీ చూసినప్పుడు మనసుకు చాలా బాధేసింది. కానీ మెల్లమెల్లగా వాటిని పట్టించుకోవడం మానేసాను’ అంటూ ఎమోషనలైంది సామ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి సామ్ ను అంతగా ద్వేషించే వారు ఎవరబ్బా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
దీపావళి వేడుకల్లో సమంత..
Bollywood and South cinema star #SamanthaRuthPrabhu embraced the festive vibes as she celebrated Diwali, spreading light and positivity among her fans. pic.twitter.com/uGWmHdIOgT
— Nayanthara Fan Club (@Nayanthara_USA) October 22, 2025
ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ పిల్లలతో కలిసి దీపావళి వేడుకల్లో సమంత..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








