షాకింగ్ నిర్ణయం తీసుకున్న రేణు దేశాయ్.. సన్యాసిగా మారనున్నాను అంటూ..
రేణు దేశాయ్ కు సామాజిక స్పృహ ఎక్కువ. పేద పిల్లలకు, జంతువులకు తన వంతు సహాయం చేస్తుంటుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు తన అభిమానులు, ఫాలోవర్లను కూడా సోషల్ మీడియా వేదికా విరాళాలు అడుగుతూ ఉంటుంది. అలాగే సోషల్ సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తుంటుంది.

సినీ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బద్రీ, జానీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన ఆమె పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇక విడాకుల తర్వాత సింగిల్ మదర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఆమధ్య రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా ఆమెకు సామాజిక స్పృహ చాలా ఎక్కువ.
సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తూ ఉంటుంది. అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా ప్రకృతి, మూగజీవాల పై తన ప్రేమను చూపిస్తుంటుంది. ఇందుకోసం తన వంతు సాయం చేయడంతో పాటు విరాళాలు కూడా సేకరిస్తుంటంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భవిష్యత్తులో సన్యాసిగా మారే అవకాశం ఉందని తెలిపారు రేణు.
ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టైగర్ నాగేశ్వరావు సినిమా తర్వాత తనపై కొన్ని విమర్శలు వచ్చాయని తెలిపింది. మళ్లీ సినిమాల్లోకి వచ్చింది ఎలాంటి పాత్రలైనా చేస్తుందా అని తనను విమర్శించారని తెలిపారు రేణు దేశాయ్. ఆ సినిమా తర్వాత నేను ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదు. నాకు నటన అంటే చాలా ఇష్టం. కానీ, అదే నా లక్ష్యం కాదు.. నేను డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే మనిషిని కాదు. ఇప్పటికీ నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. త్వరలోనే అత్త పాత్రలో కనిపిస్తా.. ఆ సినిమా త్వరలోనే ప్రారంభంకానుంది. అలాగే తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే చాలా ఇష్టమని.. భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




