Poorna : పదహారేళ్ల కెరీర్‌లో ఇలాంటి భారీ సక్సెస్‌ను చూడలేదన్న ముద్దుగుమ్మ పూర్ణ..
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ`. ఈ సినిమా ఇప్పుడు అంచనాలను మించి ఘనవిజయం సాధించింది.

Akhanda: నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ`. ఈ సినిమా ఇప్పుడు అంచనాలను మించి ఘనవిజయం సాధించింది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. ఇటీవలే అఖండ సినిమా సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌లో హీరోయిన్స్ పూర్ణ, ప్రగ్య జైస్వాల్ బాలయ్య పై ప్రసంశలు కురిపించారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. బాలయ్య గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడంలేదు అంటూ చెప్పుకొచ్చింది. అఖండ విజయం మాది. ఇది ప్రేక్షకుల విజయం. అందరి అభిమానులు ఈ సినిమాను చూసి హిట్ చేశారు. ఇలాంటి మంచి పాత్రను ఇచ్చినందుకు బోయపాటి గారికి ధన్యవాదాలు తెలిపారు పూర్ణ.
ఇలాంటి పెద్ద సక్సెస్‌ను నా పదహారేళ్ల కెరీర్‌లో చూడలేదు అని అంది. శ్రీకాంత్ గారు నన్ను భయపెట్టినా కూడా మీ అందం ముందు ఆ భయం తెలియలేదు. బాలయ్య గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. ఈ సినిమా, అఘోర పాత్ర నన్ను వెంటాడింది. మీలాంటి వారితో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. బాలయ్య బాబుకు ఎవ్వరూ దిష్టి పెట్టకూడదు’ అని చెప్పుకొచ్చింది. అలాగే హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. శరణ్య పాత్రపై ప్రేమను కురిపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి థ్యాంక్స్. బాలకృష్ణ సర్‌తో పని చేయడం ఎంతో సరదాగా ఉంది. ఆయనతో ఉన్నన్ని రోజులు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. థియేట్రికల్ రిలీజ్ కోసం ఇన్ని రోజులు సినిమాను ఆపినందుకు నిర్మాతకు థ్యాంక్స్’ అని చెప్పుకొచ్చింది ప్రగ్య.
మరిన్ని ఇక్కడ చదవండి :




