Rajeev Rayala |
Updated on: Dec 11, 2021 | 7:26 PM
గత కొన్నినెలలుగా ప్రేమలో ఉన్న కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ఒక్కటయ్యారు.
రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని హోటల్ సిక్స్ సెన్సెస్ పోర్ట్ బార్వారాలో వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
కరోనా నిబంధనలకు అనుగుణంగా అత్యంత గోప్యంగా విక్ర్టీనాల పెళ్లి జరిగింది.
తమ పెళ్లి ఫొటోలను విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసేదాక బయటకు రాలేదు.
హిందూ- పంజాబీ సంప్రదాయ ప్రకారం కత్రినా, విక్కీలు దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు.
రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్’ అనే విలాసవంతమైన హోటల్‌లో వీరి వివాహం జరిగింది.
పెళ్లి వేడుక అనంతరం వరుడు విక్కీ కౌశల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా పెళ్లి ఫొటోలను పంచుకున్నాడు. జీవితంలో తమ కొత్త ప్రయాణానికి అందరి ఆశీర్వాదం కావాలని అందులో కోరాడు.