N Chandrababu Naidu : బాలయ్య ‘అఖండ’ సినిమా పై చంద్రబాబు కామెంట్స్.. ఏమన్నారంటే..
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ హ్యాట్రిక్ సినిమా అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకుంది.

Akhanda: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ హ్యాట్రిక్ సినిమా అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మునుపెన్నడూ చూపించని విధంగా బాలయ్యను బోయపాటి చూపించి సక్సెస్ అయ్యారు. విభిన్నమైన పాత్రలో బాలకృష్ణ కూడా విజృంభించి నటించారు. ఈ సినిమా పై సామాన్యులు మాత్రమేకాదు సెలబ్రెటీలు కూడా ప్రసంశలు కురిపిస్తున్నారు. కరోనా తర్వాత తెలుగు సినిమాలకు అఖండ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పటి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కేవలం తెలుగు రాష్ట్రాలోనే కాదు ఇతర దేశాల్లోనూ అఖండ జాతర జరుగుతుంది.
ఇక అఖండ సినిమా పై తెలుగు దేశం అధినేత చంద్రబాబు స్పంధించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అఖండ సినిమా లో చూపించారన్నారు చంద్రబాబు. అఖండ సినిమా తాను చూసాను.. ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో.. అఖండ సినిమా లో చూపించారు. సినిమాలో చూపించిన విధంగానే ఇప్పుడు ఏపీ లో జరుగుతుంది. రాష్ట్రం లో ఇప్పుడు ఏమి జరుగుతుందో అఖండ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు అని అన్నారు. అలాగే అఖండ సినిమా చాలా బాగుందని కొనియాడారు చంద్రబాబు. చిత్రయూనిట్ కు అబినందనలు తెలిపారు చంద్రబాబు.
మరిన్ని ఇక్కడ చదవండి :




