AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Young Heroines 2021: ఈ ఏడాది తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసిన కొత్త ముద్దుగుమ్మలు వీరే..

ఈ ఏడాది కరోనా కల్లోలం కాస్త కంగారు పెట్టిన ప్రజలు దైర్యంగా దాన్ని ఎదుర్కొన్నారు. ఇక కరోనా కారణంగా కాస్త కుదేలైన సినిమా ఇండస్ట్రీ ఈ ఏడాది

Young Heroines 2021: ఈ ఏడాది తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసిన కొత్త ముద్దుగుమ్మలు వీరే..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2021 | 3:54 PM

Share

Young Heroines 2021: ఈ ఏడాది కరోనా కల్లోలం కాస్త కంగారు పెట్టిన ప్రజలు దైర్యంగా దాన్ని ఎదుర్కొన్నారు. ఇక కరోనా కారణంగా కాస్త కుదేలైన సినిమా ఇండస్ట్రీ ఈ ఏడాది ముందడుగేస్తు పలు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఓటీటీ రాణిస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు థియేటర్స్ లో విడుదలైన మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. అంతే కాదు ఈ ఏడాది కొత్త అందాలు కూడా టాలీవుడ్ ను పలకరించాయి. ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించిన కొత్త భామలు ఎవరంటే.. 2021లో ఎక్కువమందిని ఆకర్షించిన బ్యూటీస్ లో ఫస్ట్ ప్లేస్ మంగుళూరు బ్యూటీ కృతి శెట్టి ఉంది.

Krithi Shetty (9)కృతి శెట్టి.. 

ఉప్పెన సినిమాతో పరిచయమైన ఈ అందాల భామ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కుర్రాళ్ళ మనసులో చోటు సంపాదించుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఉప్పెన సినిమాలో కృతి లుక్స్, నటన ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. దాంతో ఈ అమ్మడికి ఓవర్ నైట్ లో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య బంగార్రాజు, సుదీర్ బాబు సినిమా, అలాగే నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటిస్తుంది.

Shree4శ్రీ లీల..

కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల అందం తో చలాకీ తనంతో కట్టిపడేసింది. చూడటానికి అచ్చం పక్కింటి పిల్లలా కనిపించే శ్రీ లీల అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పెళ్లి సందడి సినిమా మంచి విజయం సంధించడంతో  ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Kethika Sharmaకేతిక శర్మ ..

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కేతిక శర్మ. ఈ బ్యూటీ తన గ్లామర్ తో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయిన నటించిన ఈ  భామ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా గుర్తింపు తీసుకుంది. మొదటి సినిమాతోనే ఏమాత్రం మొహమాటం పడకుండా అందాలతో కనువిందు చేసింది ఈ వయ్యారి భామ

మీనాక్షి చౌదరి..

అక్కినేని కుర్ర హీరో సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో వరుస సినిమాలు పలకరిస్తున్నాయి ఈ చిన్నదాన్ని. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తుంది.. అలాగే హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2లో ఛాన్స్ దక్కించుకుంది ఈ భామ

Fariya4ఫరియా అబ్దుల్లా..

మొదటి సినిమాతోనే నటన పరంగా, అందం పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఫరియా అబ్దుల్లా. ఫరియా అబ్దుల్లా అనే కంటే ఈ అమ్మడు చిట్టీ గా బాగా క్రేజ్ తెచ్చుకుంది. జాతి రత్నాలు సినిమాలో అమాయకపు యువతిగా నటించి ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఈ సినిమాతర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో కనిపించింది ఈ చిన్నది.

Priya Prakash Varrier (9)ప్రియా వారియర్..

కన్నుగీటి కుర్రకారును కట్టిపడేసిన కుర్రది ప్రియా వారియర్. డైరెక్ట్ గా తెలుగులో నితిన్ నటించిన చెక్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమా తర్వాత తేజ సజ్జ తో కలిసి ఇష్క్ అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో సరైన సినిమా కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ. మంచి హిట్ దొరికితే తెలుగులో రాణించాలని చూస్తుంది.

Amrutha 4అమృత అయ్యర్.. 

దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాతో ఈ అమ్మడు పరిచయం అయ్యింది. నిజానికి ఇదే ఆమె మొదటి సినిమా.. కానీ తెలుగులో మాత్రం డైరెక్ట్ గా చేసిన సినిమా మాత్రం రెడ్. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన రెడ్ సినిమాతో హిట్ అందుకుంది ఏ బ్యూటీ. ఈ సినిమా తర్వాత  30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? సినిమా చేసింది. యాంకర్ ప్రధీప్ నటించిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది.

Shivaniశివాని రాజశేఖర్.. 

సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తెగా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది . యంగ్ హీరో తేజ సజ్జ నటించిన అద్భుతం సినిమాతో హీరోయిన్ గా నటించింది ఈ భామ. మొదటి సినిమాతోనే నటనపరంగా మెప్పించింది ఈ చిన్నది. ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటుంది శివాని.

Shanvi 8శాన్వి మేఘన ..

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన పిట్టా కథలు అనే సిరీస్ ద్వారా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ శాన్వి మేఘన. ఆతర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన పుష్పక విమానం సినిమాలో నటించింది ఈ తెలుగమ్మాయి. అలాగే అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ