Mahesh Babu Cine journey: మహేష్ 42 ఏళ్ల సినీ ప్రస్థానం.. వైరల్ అవుతున్న మహేష్ డీపీ..(వీడియో)
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా చిన్నతనంలోనే కేరీర్ ను ప్రారంభించిన మహేష్ ఇప్పుడు స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. ఈ సూపర్‌స్టార్ సినీ ప్రస్థానానికి 42 ఏళ్ళు..
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా చిన్నతనంలోనే కేరీర్ ను ప్రారంభించిన మహేష్ ఇప్పుడు స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. ఈ సూపర్‌స్టార్ సినీ ప్రస్థానానికి 42 ఏళ్ళు.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు హంగామా చేస్తున్నారు. తమ అభిమాన హీరో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 1979లో బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించిన మహేష్ 42 సంవత్సరాలుగా సినీ రంగంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కామన్ డీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.42ఏళ్ల గోల్డెన్ ఎరా ఆఫ్ సూపర్ స్టార్ పేరుతో మహేష్ పోస్టర్ ను అభిమానులు వైరల్ చేస్తున్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రత ఈ కామన్ డీపీని షేర్ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా సమ్మర్ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

