Pushpa 2: ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్’.. బన్నీ డైలాగ్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చింది. పుష్ప 2 సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 4 రాత్రి నుంచే షోస్ పడిపోనున్నాయి.

Pushpa 2: 'పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్'.. బన్నీ డైలాగ్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2024 | 5:52 PM

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 05న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అంతకన్న ముందుగా అంటే డిసెంబర్ 4 రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ బెనిఫిట్ షోలు స్టార్ట్ కానున్నాయి. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్‌ మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్ లోనూ రికార్డులు బద్దలయ్యాయి. ప్రస్తుతం దేశమంతా పుష్ప ఫీవర్ కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ పుష్ప రాజ్ పేరు బాగా వినిపిస్తోంది. ఎక్కడ చూసినా తగ్గేదేలే అంటూ పోస్టులు పెడుతున్నారు. సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, తారలు కూడా పుష్ప 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో పుష్ప రాజ్ డైలాగ్ తో అదరగొట్టింది పాయల్. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్’ అంటూ తన దైన శైలిలో పుష్ప రాజ్ ను ఇమిటేట్ చేసింది. ఈ సందర్భంగా పుష్ప-2 చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పింది. ఈ మాస్టర్ పీస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ‘అదర గొట్టారు మేడమ్’ అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా పుష్ప 2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ్, సునీల్, అనసూయ, జగదీష్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

పుష్ప రాజ్ ను అనుకరించిన పాయల్ పాప.. వీడియో ఇదిగో..

ఏపీలోనూ పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.