Actress Abhinaya: నిశ్చితార్థం చేసుకున్న నటి అభినయ.. ఎంగేజ్మెంట్ ఫోటో వైరల్.. వరుడు ఎవరంటే..
సౌత్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి అభినయ. తెలుగు, తమిళం, మలయాళంలో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న ఆమె.. తాజాగా అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకుంది. త్వరలోనే తాను పెళ్లి పీటలెక్కనున్నట్లు చెబుతూ నిశ్చితార్థం ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది.

విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇటీవలే రీరిలీజ్ అయిన ఈసినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్లలో ఫ్యామిలీ అడియన్స్ ఈ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాతో మరింత ఫేమస్ అయిన నటి అభినయ గుడ్ న్యూస్ పంచుకుంది. ఈ మూవీలో వెంకీ, మహేష్ బాబులకు చెల్లిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా శుభవార్త పంచుకుంది. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతూ.. ఇన్ స్టాలో ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేసింది. కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతున్న ఫోటోను పంచుకుంది.
“మా ప్రయాణం నేటితో ప్రారంభమైంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కానీ తనకు కాబోయే భర్తను మాత్రం చూపించలేదు. అలాగే అతడికి సంబంధించిన వివరాలను కూడా చెప్పలేదు. ప్రస్తుతం అభినయ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్, సెలబ్రెటీస్ ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితం హీరో విశాల్ తో అభినయ ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోనున్నారంటూ ప్రచారం నడిచింది. వీరిద్దరు కలిసి పూజ, మార్క్ ఆంటోని చిత్రాల్లో నటించడంతో అనేక రూమర్స్ తెరపైకి వచ్చాయి.
అయితే తమ గురించి వస్తున్న వార్తలను విశాల్, అభినయ ఇద్దరూ ఖండించారు. విశాల్ అంటే తనకు చాలా గౌరవమని.. ఆయనకు ఆరోగ్యం బాలేనప్పుడు పలకరించానని.. అంతకంటే తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని.. తాను తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దాదాపు 15 ఏళ్లుగా తనతో ప్రేమలో ఉన్నానని.. అతడు తనను బాగా అర్థం చేసుకుంటాడని.. ఎలాంటి భయం లేకుండా అతడితో అన్ని విషయాలను పంచుకోగలనని.. పెళ్లి చేసుకోవడానికి సమయం పడుతుందని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు నిశ్చితార్థం ఫోటో షేర్ చేస్తూ పెళ్లి కబురు చెప్పేసింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..