Samantha: సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అమెజాన్ ప్రైమ్‏లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే..

ఓవైపు వెండితెరపై అగ్రకథానాయికగా పాపులర్ అయిన సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏తో ఓటీటీ ప్లాట్ ఫాంలోకి అడుగుపెట్టంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‏లో పూర్తిగా నెగిటివ్ షెడ్స్ ఉన్న రాజీ పాత్రలో అదరగొట్టేసింది. ఇందులో సామ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతుంది. గతంలో ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ కు సిద్దమయినట్లుగా టాక్ వినిపిస్తుంది.

Samantha: సమంత నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అమెజాన్ ప్రైమ్‏లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే..
Citadel Series
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2023 | 9:25 PM

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో సమంత ఒకరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ సామ్. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు, విభిన్న కంటెంట్ స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు వెండితెరపై అగ్రకథానాయికగా పాపులర్ అయిన సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏తో ఓటీటీ ప్లాట్ ఫాంలోకి అడుగుపెట్టంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‏లో పూర్తిగా నెగిటివ్ షెడ్స్ ఉన్న రాజీ పాత్రలో అదరగొట్టేసింది. ఇందులో సామ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతుంది. గతంలో ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ కు సిద్దమయినట్లుగా టాక్ వినిపిస్తుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సామ్ నటించిన సిటాడెల్ సిరిస్ స్ట్రీమింగ్ కాబోతుంది. రాజ్ అండ్ DK రూపొందించిన ఈ సిటాడెల్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగ నటించనున్నాడు. నివేదికల ప్రకారం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే ఏడాది వేసవిలో అంటే.. మే లేదా జూన్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. సిటాడెల్..ఒక అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ టీవీ సిరీస్. హాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించగా.. ఆమె స్థానంలో ఇప్పుడు సామ్ నటించింది. ఇంతకు ముందు సామ్ నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ సైతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించడంతో.. ఇప్పుడు సిటాడెల్ సిరీస్ పై మరింత ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే.. సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో కనిపించింది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ తర్వాత మయోసైటిస్ సమస్య మరింత వేధించడంతో సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత కొన్ని నెలలు అమెరికాలో చికిత్స తీసుకున్న సామ్.. ఇటివలే భూటాన్ లో ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంది. రెండు రోజుల క్రితం సామ్ హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. ఇక కొద్దిరోజుల్లోనే సామ్ సిటాడెల్ ప్రమోషన్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

View this post on Instagram

A post shared by MTV Hustle (@mtvhustle)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.