Cinema : పెళ్లైన దంపతులు కచ్చితంగా చూడాల్సిన సినిమా.. ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది..
ఓటీటీలో ఓ కొత్త సినిమా తుఫానులా దూసుకుపోతుంది. ఇప్పుడు ఆ మూవీ టాప్ 10లో మొదటి స్థానంలో నిలిచింది. ఇది బాక్సాఫీస్ వద్ద 300 % కంటే ఎక్కువగా లాభాలను ఆర్జించింది. అంతేకాదు.. ఫ్యామిలీ అడియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న మూవీ ఏంటో తెలుసా.. ?

భారీ బడ్జెట్, యాక్షన్ సీక్వెన్స్, స్టార్ హీరోయిన్లతో తెరకెక్కించే సినిమాలు ఇప్పుడు బాక్సాఫఈస్ వద్ద ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ చిన్న సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. ఆధునిక సంబంధాలు, కుటుంబ అంచనాలు, దంపతుల మధ్య ప్రేమ, చిన్న చిన్న గొడవలు, ఆప్యాయతలను చూపిస్తుంది. ఆ మూవీ పేరు సార్ మేడమ్. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామాలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 2025 జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి అడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
కథ విషయానికి వస్తే.. పరోటా మాస్టర్ అయిన ఆగస వీరన్ (విజయ్ సేతుపతి) విద్యావంతురాలైన, ధైర్యవంతురాలైన పెరారసి (నిత్య మీనన్) చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఇద్దరు భార్యభర్తలు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి జీవితంలో అనుకోని సంఘటనలతో మనస్పర్థలు తలెత్తుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు.. అహంకారాలతో సాగుతుంది. అపార్థాలు ఉన్నప్పటికీ ప్రేమ ఎలా భరించగలదో ఈ సినిమా ద్వారా చూపించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..
ఇవి కూడా చదవండి : Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..
కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 126 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. పాజిటివ్ రివ్యూస్ రావడంతో ఈ సినిమా చూసేందుకు జనాలు క్యూ కట్టారు. ఎప్పుడూ విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకునే విజయ్.. మరోసారి ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇప్పుడు టాప్ 10 ట్రెండింగ్ చిత్రాలలో మొదటి స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదేం సినిమా రా బాబోయ్.. యాక్షన్, సస్పెన్స్, ట్విస్టులతో బుర్రపాడు.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది..








