AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఇదేం సినిమా రా బాబోయ్.. యాక్షన్, సస్పెన్స్, ట్విస్టులతో బుర్రపాడు.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది..

ఓటీటీలో నిత్యం కొత్త కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. విభిన్న జోనర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కొన్ని సిరీస్ లు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులు, క్రైమ్, సస్పెన్స్ వంటి కంటెంట్ ను చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా సైతం ఓటీటీలో దూసుకుపోతుంది.

Cinema : ఇదేం సినిమా రా బాబోయ్.. యాక్షన్, సస్పెన్స్, ట్విస్టులతో బుర్రపాడు.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది..
The 100 Movie
Rajitha Chanti
|

Updated on: Sep 02, 2025 | 6:30 AM

Share

ఓటీటీలో ఎల్లప్పుడు కొత్త కంటెంట్ విడుదలవుతుంది. విభిన్న జోనర్‌ల సినిమా-సిరీస్‌లు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం, ప్రేక్షకులు క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ వంటి కంటెంట్‌ను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న సినిమా గురించి తెలుసా.. ? మీకు థ్రిల్, యాక్షన్, మిస్టరీ సినిమాలు చూడడం ఇష్టమైతే ఈ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. అదే తెలుగు మూవీ ది 100. గత నెల జూలై 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..

రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొగలి రేకులు సీరియల్ ఫేమ్ సాగర్ హీరోగా నటించారు. అలాగే మీషా నారంగ్, ధన్య బాలకృష్ణన్ హీరోయిన్లుగా నటించారు. నగరంలో జరిగే దొంగతనాల గురించి దర్యాప్తు చేసే IPS అధికారి గురించి ఈ కథ ఉంటుంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, కొత్త రహస్యాలు బయటపడతాయి. ఆర్తి అనే మహిళ కథలోకి ప్రవేశిస్తుంది. దీంతో సినిమా ఊహించని మలుపు తిరుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ లు, డార్క్ మిస్టరీతో సాగుతుంది.

ఇవి కూడా చదవండి : గ్లామర్‏లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..

ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన రెండు రోజుల్లోనే ట్రెండింగ్ జాబితాలోకి వచ్చేసింది. ఈ చిత్రం IMDb లో 8.4 రేటింగ్‌ను పొందింది. అలాగే అత్యధిక రేటింగ్ పొందిన సస్పెన్స్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, హిందీ భాషలలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..