OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి నిత్యం సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లు వస్తున్న సంగతి తెలిసిందే. సినీ ప్రియులను అలరించేందుకు కొత్త కంటెంట్ తీసుకువస్తున్నారు మేకర్స్. ఈమధ్య కాలంలో హారర్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్ అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యింది అప్సర రాణి. ఫోర్ లెటర్స్ మూవీతో కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత క్రాక్, సిటీమార్, హంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మరింత పాపులర్ అయ్యింది. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన డేంజరస్ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత ఆర్జీవీ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ ఢీ కంపెనీలో ఓ సాంగ్ చేసింది. ఇటీవలే అప్సరరాణి కథానాయికగా రాచరికం సినిమాలో నటించింది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. పొలిటీషియన్ గా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించింది. ఈ సినిమా తర్వాత అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ తలకోన. ఇందులో అజయ్ ఘోష్, అశోక్ కుమార్ కీలకపాత్రలు పోషించారు.
నగేష్ నారదాసి దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది మార్చిలో థియేటర్లలో విడుదలైంది. అప్సరరాణి గ్లామర్, యాక్టింగ్ తలకొన సినిమాకు హైలెట్ అయ్యాయి. ఐఎమ్డీబీలో 8.7 రేటింగ్ కలిగి ఉంది. థియేటర్లలో ఇన్నాళ్లు అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో విడుదలైంది. రూ.99 రెంటల్ ఛార్జెస్ గా ఫిక్స్ చేశారు. థియేటర్లలో విడుదలైన పది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
కథ విషయానికి వస్తే.. ఇందులో సారా అనే మోడల్ పాత్రలో నటించింది అప్సరరాణి. ఓ బ్యూటీ కంటెస్ట్ లో ఆమె విజేతగా నిలుస్తుంది. ఆ సక్సెస్ సెలబ్రేట్ చేసుకునేందుకు తలకోన అడవి మధ్యలో ఉన్న ఓ రిసార్ట్ కు వెళ్తుంది. అక్కడ పార్టీలో మినిస్టర్ తమ్ముడితో సారాకు గొడవ జరగ్గా.. దీంతో ఆమెపై పగ పెంచుకున్న అతడు.. ఆమెను చంపేందుకు ప్లాన్ చేస్తాడు. అతడి నుంచి సారా ఎలా బయటపడింది..? అనేది సినిమా.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన