AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Ikon 2: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మానస్, కావ్య.. డ్యాన్స్ ఐకాన్ షోలో బ్రహ్మముడి జంట..

బుల్లితెరపై బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మానస్, కావ్య. ఈ సీరియల్లో వీరిద్దరి కెమిస్ట్రీ, యాక్టింగ్, కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది ఈ జోడి. యాంకర్ ఓంకార్ హోస్టింగ్ చేస్తున్న ఈ షో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. తాజాగా యాంకర్ ఓంకార్ ఈ షో గురించి కామెంట్స్ చేసారు.

Dance Ikon 2: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న మానస్, కావ్య.. డ్యాన్స్ ఐకాన్ షోలో బ్రహ్మముడి జంట..
Dance Ikon 2
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2025 | 12:51 PM

Share

డాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అయ్యిందని ప్రముఖ యాంకర్ , దర్శకుడు,డాన్స్ ఐకాన్ సీజన్ 2 హోస్ట్ ఓంకార్ తెలిపారు.డ్యాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలుసని, డాన్స్ ఐకాన్ 2 అంతకుమించి అలరించబోతుందని చెప్పారు.

నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు డాన్స్ ఐకాన్ 2 టీం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ ఓంకార్ మాట్లాడుతూ…ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హోస్ట్ గా చేస్తుండటం హ్యాపీగా ఉందన్నారు. శేఖర్ మాస్టర్ సెకండ్ టైమ్ ఈ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారని,డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందన్నారు. డ్యాన్స్, ఎంటర్ టైన్ మెంట్..ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుందన్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారని చెప్పారు. పంచభూతాల్లాంటి వారి పర్ ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందన్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పర్ ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందన్నారు. ముగ్గురు హోస్ట్ లతో పాటు మరో నలుగురు మెంటార్స్ ఉంటారని,. డ్యాన్సర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారని చెప్పారు. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ లో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారని అన్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ చేసే అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్ చెప్పారు. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో అని అన్నారు.

అనంతరం డాన్స్ ఐకాన్ 2 మెంటర్స్ మానస్, దీపిక మాట్లాడుతూ సీరియల్‌ లో భార్యాభర్తలుగా నటిస్తూ వచ్చామని, ఈ డ్యాన్స్ షోలో మాత్రం మెంటర్లుగా ఒకరితో మరొకరు పోటీపడబోతున్నామని తెలిపారు.ఇటువంటి అవకాశం కల్పించిన ఓంకార్ కు ధన్యవాదాలు తెలియజేశారు.డ్యాన్స్ ఐకాన్ 2 ఊహలకు అందనివిధంగా అద్భుతంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో మెంటర్ ప్రకృతి,డాన్స్ మాస్టర్ యశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

Follow Us