Abhishek Bachchan: బాబోయ్.. ఐశ్వర్య భర్త ఆస్తులు తెలిస్తే ఫ్యూజుల్ అవుట్.. పెట్టుబడులు వింటే షాకే..

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరో తనయుడు. కానీ సినీరంగంలో మాత్రం తండ్రిలాగా కొడుకు సక్సెస్ కాలేకపోయాడు. కథానాయకుడిగా సక్సెస్ కాకపోయినా.. వ్యాపారవేత్తగా మాత్రం విజయం సాధించాడు. వ్యాపార రంగంలో ఎన్నో పెట్టుబడులు పెట్టాడు. స్టార్ హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Abhishek Bachchan: బాబోయ్.. ఐశ్వర్య భర్త ఆస్తులు తెలిస్తే ఫ్యూజుల్ అవుట్.. పెట్టుబడులు వింటే షాకే..
Abhishek Bachchan, Aishwary
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 05, 2025 | 11:04 AM

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ గురించి చెప్పక్కర్లేదు. బీటౌన్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోలలో అతడు ఒకరు. కానీ కథానాయకుడిగా అంతగా సక్సెస్ మాత్రం కాలేకపోయాడు. ఫిబ్రవరి 5న అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు. దీంతో అతడికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అమితాబ్ కొడుకుగానే కాకుండా హీరోయిన్ ఐశ్వర్య రాయ్ భర్తగానూ మరింత పాపులర్ అయ్యాడు. అయితే హీరోగా స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయినా.. వ్యాపారరంగంలో మాత్రం సత్తా చాటారు. అభిషేక్ బచ్చన్ పెట్టుబడిలో ముందున్నారు. నటుడిగా ఆయన విజయవంతం కాకపోయినా, వ్యాపారవేత్తగా ఆయన విజయం సాధించారు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆస్తుల విలువ రూ.776 కోట్లు. అయితే, అభిషేక్ బచ్చన్ ఆస్తులు కేవలం రూ.280 కోట్లు మాత్రమే. అభిషేక్ తో పోలిస్తే, ఐశ్వర్య చాలా ధనవంతురాలు. తండ్రి అమితాబ్ బచ్చన్ నుంచి అభిషేక్ కొన్ని వేల కోట్ల ఆస్తులను పొందగల్గుతాడు. అభిషేక్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో చాలా పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా, అభిషేక్ దుబాయ్‌లో ఒక విల్లా కొనుగోలు చేశాడు.2015లోనే ఆ ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ విల్లా గోల్ఫ్ ఎస్టేట్స్ సమీపంలో ఉంది. అభిషేక్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఇక్కడే ఉంటాడు. దీని ధర 16 కోట్ల రూపాయలు. ఈ ప్రాంతంలో మొత్తం 97 రిసార్ట్ తరహా విల్లాలు ఉన్నాయి.

గత ఏడాది కాలంలో అభిషేక్ బచ్చన్ 100 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారని సమాచారం. అభిషేక్ బచ్చన్ ‘బాంద్రా-కుర్లా’ కాంప్లెక్స్, 5 BHK అపార్ట్‌మెంట్‌తో సహా అనేక ప్రదేశాలలో పెట్టుబడులు పెట్టారు. అభిషేక్ బచ్చన్‌కు క్రీడలంటే ప్రత్యేక ఆసక్తి. అందుకే జైపూర్ పింక్ పార్టనర్స్ (ప్రో కబడ్డీ), చెన్నైయిన్ FC (ఫుట్‌బాల్) పెట్టుబడి పెట్టారు. అతను అమితాబ్ బచ్చన్ నిర్మాణ సంస్థలో కీలక వ్యక్తి. అతను తన తండ్రితో కలిసి అనేక వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాడు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన