Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ‘మార్వెల్‌ను మించి ఉందబ్బా’.. పుష్ప 2 యాక్షన్ సీక్వెన్స్‌కు ఫిదా అవుతోన్న ఇంటర్నేషనల్ ఫ్యాన్స్

పుష్ప 2' సినిమా సందడి ఇంకా తగ్గలేదు. ఈ సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది. థియేటర్లలో హిట్ అయిన 'పుష్ప 2' సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. వివిధ దేశాల ప్రేక్షకులు ఈ సినిమాను చూసి తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

Pushpa 2: 'మార్వెల్‌ను మించి ఉందబ్బా'.. పుష్ప 2 యాక్షన్ సీక్వెన్స్‌కు ఫిదా అవుతోన్న ఇంటర్నేషనల్ ఫ్యాన్స్
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2025 | 10:57 AM

‘పుష్ప 2’ సినిమా గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది. తద్వారా దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో భారతీయ సినిమాగా రికార్డుల కెక్కింది. థియేటర్లలో రికార్డుల మోత మోగించిన ‘పుష్ప 2’ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము దులుపుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి 30 నుంచి పుష్ప 2 సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత భారతదేశంలోనే కాకుండా విదేశీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. దీంతో ‘పుష్ప 2’ సినిమా నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రేక్షకులు థియేటర్లలో చూడని కొన్ని క్లిప్‌లతో ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలో విడుదలైంది. ఆ అదనపు 23 నిమిషాల సీన్లను చూసేందుకు ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీలో పుష్ప 2 కు రికార్డు వ్యూస్ వస్తున్నాయి. వివిధ దేశాల ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను చూస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ అడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. అల్లు ‍అర్జున్‌ గాల్లోకి ఎగిరే ఫైట్ సన్నివేశాలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో పలువురు నెటిజన్స్‌ సోషల్ మీడియా వేదికగా ఆ ఫైట్ సీక్వెన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక ఇంటర్నేనేషనల్ ఫ్యాన్స్ సైతం పుష్ప 2 యాక్షన్ సీక్వెన్స్ పై స్పందిస్తున్నారు. ‘అమెరికా చిత్రాల కంటే బాగానే ఉందని, మార్వెల్‌లో కూడా ఈ క్రియేటివీటీ సాధ్యం కాలేదంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

పుష్ప 2 క్లైమాక్స్ ఫైట్..

మొత్తానికి ‘పుష్ప రాజ్ అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్’ అంటూ పుష్ప 2‌ మూవీలోని డైలాగ్‍ను బన్నీ నిజం చేశాడంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు కొల్లగొడుతోంది.

నెట్ ఫ్లిక్స్ లో పుష్ప 2 స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.