- Telugu News Photo Gallery Cinema photos Actress Parvati Nair gets engaged businessman Aashrith Ashok, See photos
Tollywood: పెళ్లిపీటలెక్కనున్న క్రేజీ హీరోయిన్.. ప్రియుడితో ఎంగేజ్‌మెంట్.. ఫొటోస్ వైరల్
15 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫిల్మ్ ఫేర్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సొంతం చేసుకుంది.
Updated on: Feb 04, 2025 | 1:39 PM

మలయాళ ప్రముఖ హీరోయిన్ పార్వతి నాయర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఓ వ్యాపార వేత్తతో కలిసి ఆమె ఏడడుగులు నడవనుంది.

చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్ తో ప్రేమలో ఉన్న ఆమె త్వరలోనే ఏడడుగులు వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అంతేకాదు తమ నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పార్వతి నాయర్- అశోక్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

'మైసూర్ శాండల్' సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా పార్వతి నాయర్ పేరు మార్మోగిపోయింది. ఇప్పటి వరకు సుమారు 30కి పైగా చిత్రాల్లో నటించిందీ అందాల తార.

తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెండాపై కపిరాజు సినిమాలో పార్వతి నాయర్ పాత్రలో మెప్పించింది. గతేడాది విజయ్ నటించిన ది గోట్ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో మెరిసిందీ అందాల తార.





























