అబ్బాయి లా మారిపోయిన సమంత..ఫొటోస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఏమాయ చేశావే సినిమాతో కుర్రకారు మనసు దోచేసుకున్న ముద్దుగుమ్మ సమంత. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకొని, వరస సినిమాలతో టాలీవుడ్‌నే షేక్ చేసిందని చెప్పవచ్చు. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ, టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.
Updated on: Feb 04, 2025 | 7:09 PM

కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే సమంత ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనారోగ్య సమస్యలతో ఈ బ్యూటీ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మ తన హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి, మళ్లీ సినిమాలపై ఫొకస్ చేసింది. మా ఇంటి బంగారం లాంటి ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉంది.

ఇక ఈ మధ్య సమంత నా అభిమానుల కోసం నేను సినిమాలు చేస్తాను. కానీ ఛాలెజింగ్‌గా ఉన్న పాత్రలనే ఎంచుకుంటాను అని తెలిపిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా సామ్ స్టన్నింగ్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఈ బ్యూటీ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోల్లో అచ్చం అబ్బాయిలా కనిపిస్తుంది. ఇందులో సమంత చాలా అందంగా ఉంది.

దీంతో ఈ ఫొటోలపై పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సూపర్ అంటే మరికొందరు ఈ బ్యూటీ హాలీవుడ్ చెక్కేస్తుంది అందుకే ఇలా రెడీ అయ్యిందని అంటున్నారు.





























