- Telugu News Photo Gallery Cinema photos Our heroes are ready to do web series if they like the story
Web Series: వెబ్ సిరీస్‌లపై మన హీరోల చూపులు.. కథ నచ్చితే సిద్ధం..
ఎంతసేపు 70 MM స్క్రీన్ మీదే ఏం కనిపిస్తాం.. అప్పుడప్పుడూ చిన్నితెరపై కూడా కనిపిస్తే పోలా అంటున్నారు మన హీరోలు. మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో ఈ పాటికే అర్థమైంది కదా..? ఆ.. అదే మీరు ఊహించిందే..! మన హీరోల చూపులిప్పుడు వెబ్ సిరీస్‌లపై పడుతున్నాయి. ఒక్కొక్కరుగా దిగొచ్చి.. డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై మెరుస్తున్నారు. ఇదే ట్రెండిప్పుడు.
Updated on: Feb 04, 2025 | 11:36 AM

బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ లాంటి స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్‌లలో నటించారు. కానీ మన దగ్గర ఇంకా అంత ఓపెన్ కాలేదు హీరోలు. రెండేళ్ళ కింద నాగ చైతన్య దూతతో ఓటిటి ఎంట్రీ ఇచ్చారు. ఇది బానే వర్కవుట్ అయింది.. త్వరలోనే దూత 2తో రానున్నారు.

ఇక వెంకటేష్, రానా కలిసి చేసిన రానా నాయుడు అయితే ఓటిటిలో ఓ సంచలనమే. రానా నాయుడుతో ఒకేసారి ఓటిటి ఎంట్రీ ఇచ్చారు వెంకీ, రానా. దీనికి విమర్శలెన్ని వచ్చాయో.. వ్యూవర్ షిప్ కూడా అంతే వచ్చింది.

దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసాకే.. పార్ట్ 2 చేస్తున్నారు మేకర్స్. అయితే ఇందులో డోస్ కాస్త తగ్గిస్తున్నామని చెప్పారు వెంకటేష్. రానా నాయుడు సీజన్ 2 కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

నాగ చైతన్య, వెంకటేష్, రానా తర్వాత తాజాగా మరో హీరో కూడా వెబ్ సిరీస్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనే సందీప్ కిషన్..! నెట్ ఫ్లిక్స్ కోసం త్వరలోనే ఓ సిరీస్ చేయబోతున్నారీయన. టిల్లు స్క్వేర్ ఫేమ్ మల్లిక్ రామ్ ఈ సిరీస్‌కి దర్శకుడు. ప్రస్తుతం మజాకా సినిమాతో బిజీగా ఉన్నారు సందీప్.. త్వరలోనే ఇది విడుదల కానుంది.

బాలయ్య, నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఓటిటిలో హోస్టులుగా చేసారు.. చేస్తున్నారు కానీ వెబ్ సిరీస్‌ల వైపు మాత్రం చూడలేదు. కానీ కథ నచ్చితే తనకు వెబ్ సిరీస్ చేయాలని ఉందంటూ ఈ మధ్యే చెప్పారు చిరంజీవి. ఇక నాగార్జున సైతం ప్రయోగాలకు ఓపెన్‌గానే ఉంటారు. మరి చూడాలిక.. తెలుగులో ఈ కల్చర్ ఎప్పుడు ఊపందుకుంటుందో..?





























