AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mastan Sai: వీడు సైకో కాదు.. అంతకు మించి.. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో నమ్మలేని నిజాలు

మస్తాన్ సాయి.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోన్న పేరు. రాజ్ తరుణ్- లావణ్యల వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన అతనిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో మస్తాన్ సాయి గురించి ఎవరూ ఊహించని, నమ్మలేని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Mastan Sai: వీడు సైకో కాదు.. అంతకు మించి.. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో నమ్మలేని నిజాలు
Mastan Sai
Basha Shek
|

Updated on: Feb 05, 2025 | 10:21 AM

Share

మస్తాన్‌సాయి.. సైకో అంటే ఎలా ఉంటాడో.. మనిషనేవాడు ఎలా ఉండకూడదో చెప్పడానికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌..! ఇప్పుడీ సైతాన్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన గుట్టు బయటపడుతుందని అనుమానం వస్తే కాళ్లబేరానికి వచ్చి సూసైడ్‌ చేసుకుంటానని బెదిరిస్తాడు.. తెరవెనుక తనకు అడ్డొచ్చిన వాళ్లను చంపేందుకూ స్కెచ్చులు వేస్తాడు.. ఇలా ఎన్నో నమ్మలేని నిజాలు రిమాండ్‌ రిపోర్ట్‌లో ఉన్నాయి. జనవరి 30న మస్తాన్‌సాయి లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చెయ్యకపోతే.. వీడెంత కామపిశాచో, ఎన్ని వందల మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో, ఎంతటి దారుణమైన వ్యక్తో బయటకు తెలిసేది కాదేమో! డ్రగ్స్‌ మత్తులో అక్కడ గొడవ చేయడం, లావణ్య కంప్లైంట్‌ చేయడంతో అరెస్టయ్యాడు. ఇప్పుడు మొత్తం వ్యవహారం బయటకు వచ్చేసింది. 2022లో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో లావణ్యకు డ్రగ్స్‌ ఇచ్చి ప్రైవేట్‌ వీడియోలు తీశాడు మస్తాన్‌సాయి. తర్వాత ఈ విషయం లావణ్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మస్తాన్‌సాయి, లావణ్య మధ్య గతంలో రాజ్‌తరుణ్‌ రాజీ కుదిర్చాడు.మస్తాన్‌ ల్యాప్‌టాప్‌లో ఉన్న లావణ్య వీడియోలు డిలీట్ చేయిచాడు.. ఐతే.. అవి డిలీట్‌ చేసే లోపే వేరే సిస్టమ్‌లోకి వాటిని కాపీ చేసి దాచిపెట్టుకున్నాడు. ఇలాంటి చాలా అరాచకాలు రిమాండ్‌ రిపోర్ట్‌లో ఉన్నాయి.

కాగా హార్డ్ డిస్క్ కోసం లావణ్య ను పలు మార్లు చంపాలని మస్తాన్ సాయి ప్లాన్ చేశాడు. జనవరి. 30 న లావణ్య ఇంటికి వెళ్లిన మస్తాన్ సాయి లావణ్య పై హత్య యత్నం చేశాడు. దీంతో అతనిపై NDPS సెక్షన్ ను కూడా జోడించారు పోలీసులు. ఈ కేసులో మస్తాన్ సాయి, అతడి స్నేహితుడు ఖాజా కు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి