Game Changer OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే ఏకంగా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గేమ్ ఛేంజర్. వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్ తో జోడి కట్టింది. అంజలి మరో హీరోయిన్ గా యాక్ట్ చేయగా, ఎస్ జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టాడు. వీరితో పాటు శ్రీకాంత్, సునీల్, బ్రహ్మానందం, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల వంటి స్టార్ యాక్టర్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టుతోంది. రామ్ చరణ్ సినిమా కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డులు కొల్లగొట్టింది. ఓ ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగిన పోరాటాన్ని సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కించారు శంకర్. ఇక ఇందులో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే థమన్ అందించిన పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన గేమ్ ఛేంజర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 07 నుంచి గేమ్ ఛేంజర్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాగా థియేటర్లలో విడుదలైన తర్వాత నెల రోజుల ముందే గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం.
కాగా అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మించారు. తమన్ అందించిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజైంది. అయితే సినిమా రిలీజైన కొద్ది రోజులకే ఈ మూవీ పైరసి బారిన పడింది. బస్సులు, లోకల్ టీవీ ఛానెల్స్ లోనూ ఈ మూవీ ప్రసారమైంది. ఇది సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించింది.
మరో మూడు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
raa macha, buckle up 😎 the rules are about to CHANGE 👀#GameChangerOnPrime, Feb 7 pic.twitter.com/ewegjT69yL
— prime video IN (@PrimeVideoIN) February 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.