AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daaku Maharaaj OTT: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి డాకు మహారాజ్! ఆరోజు నుంచే స్ట్రీమింగ్

ఆఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. కొల్లి బాబీ దర్శకత్వంలో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Daaku Maharaaj OTT: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి డాకు మహారాజ్! ఆరోజు నుంచే స్ట్రీమింగ్
Daaku Maharaaj Movie
Basha Shek
|

Updated on: Feb 05, 2025 | 6:35 AM

Share

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. కొల్లి బాబీ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రల్లో మెరిశారు . బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను మెప్పించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైన డాకు మహారాజ్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తద్వారా బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత జోరు కొనసాగించిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ బీజీఎమ్.. డాకు మహారాజ్ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలపడంలో కీలక పాత్ర పోషించాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. డాకు మహారాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించి నట్లు సమాచారం .  తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ వారంలోనే డాకు మహారాజ్ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ డాకు మహారాజ్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య తెరకెక్కించిన డాకు మహారాజ్ సినిమాలో సచిన్ ఖేడ్ కర్, హిమజ, వీటివి గణేష్, ఆడుకలం నరేన్, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్ పాండే, సందీప్ రాజ్, బిగ్ బాస్ దివి, రిషి, రవికిషన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతమందించారు.

ఫిబ్రవరి 09 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు